English | Telugu
కృష్ణా నీళ్ల దొంగతనాన్ని ఆపండి!మరో ఉద్యమం తప్పదు!
Updated : May 13, 2020
కెసిఆర్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి ఉత్తర తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దక్షిణ తెలంగాణను విస్మరించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు కొత్త లిఫ్ట్ తో శ్రీశైలం నుండి రోజుకు మూడు టీఎంసీల నీటిని ఆంధ్ర ప్రాంతానికి తరలించుకుపోతే పాలమూరు, నల్లగొండ , రంగారెడ్డి జిల్లాలకు తీవ్ర అన్యాయం జరగనుంది. కొన్ని విషయాల్లో సంప్రదింపులు జరుపుకునే కెసిఆర్ జగన్ మాట మాత్రం చర్చించకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ఏడు వేల కోట్లతో ఫస్ట్ ఫేస్ కింద పనులు జరపాలని నిర్ణయం తీసుకోవడం విచిత్రంగా అనిపిస్తుంది.
కృష్ణా గోదావరి ట్రిబ్యున ళ్ళ ను తానే పద్ధతి ప్రకారం తీర్చిదిద్దాడని చెప్పే కెసిఆర్ కు చెప్పకుండా దక్షిణ తెలంగాణలో మూడు జిల్లాలను ఎండబెట్టే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమే... ఓ వైపు జగన్ కెసిఆర్ అన్నదమ్ములు అంటూ ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించడం... ఆంధ్ర తెలంగాణ ప్రాజెక్టులో పనిచేస్తున్న కాంట్రాక్టర్లు వీళ్ళిద్దరికీ పరోక్షంగా దగ్గరగా ఉండడం ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది...కాలేశ్వరం కింద చేపట్టే ప్రాజెక్టులన్నీ తన ఘనతగా చెప్పుకునే కెసిఆర్ ఆంధ్ర ప్రభుత్వం చేస్తున్న ఈ వంచను ఎలా సమర్థించుకుంటా డు. "నువ్వు కొట్టినట్లు చెయ్ నేను ఏడ్చినట్లు చేస్తా "అన్న సామెత లాగా నడుస్తున్న ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించాలి... ఇప్పటికైనా ఈ ప్రాంత శాసనసభ్యులు ఎంపీలు మాట్లాడకపోతే... మరో ఉద్యమం తప్పదు.