English | Telugu

జూబ్లీలో బీఆర్‌ఎస్ గెలుపుతో... కాంగ్రెస్ పతనం స్టార్ట్ : కేటీఆర్

జూబ్లీహిల్స్‌ లో గెలుపు పక్కా.. కానీ మెజార్టీ ఎంతో తేలాల్సి ఉందని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. షేక్‌పేట్ డివిజ‌న్‌లో నిర్వ‌హించిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్య‌ర్థి మాగంటి సునీత‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు. జీవో నంబ‌ర్ 58, 59 కింద హైద‌రాబాద్ న‌గ‌రంలో ల‌క్షా 50 వేల మంది పేద‌ల‌కు మాజీ సీఎం కేసీఆర్ ప‌ట్టాలిచ్చారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ అధికారంలోకి వ‌చ్చాక కొత్త‌గా ఒక్క ప‌ట్టా ఇవ్వ‌లేదని కేటీఆర్ ఆరోపించారు.

అన్ని రంగాల్లో టాప్‌లో ఉండే తెలంగాణ నేడు దిగ‌జారిందని. సంపద సృష్టించండంలో నంబ‌ర్ వ‌న్‌లో ఉన్న తెలంగాణ‌లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం నాశ‌నం చేసిండని ఆరోపించాడు. ఆటో అన్న‌లను దెబ్బ‌తీశారు. 162 మంది ఆటో డ్రైవ‌ర్లు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ప‌రిశ్ర‌మ‌లు పారిపోతున్నాయి. ప‌క్క రాస్ట్రాల‌కు త‌ర‌లిపోతున్నాయి. అదే కేసీఆర్ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఐటీలో సృష్టించారు. ఇంత అద్భుతంగా కేసీఆర్ ప‌ని చేసి నంబ‌ర్ వ‌న్ చేశారు.

రేవంత్ రెడ్డి హ‌యాంలో తెలంగాణ చివ‌రి ర్యాంకులో ఉంది అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే.. నేనేం చేయకపోయినా వీళ్లు మళ్లీ నాకే ఓటేస్తారని రేవంత్‌ రెడ్డి అనుకుంటారు..ఒక్కసారి కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన టైమ్‌ వచ్చిందని కేటీఆర్ అన్నారు. హైద‌రాబాద్‌లో 2023 ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు ఇవ్వ‌లేదు . కేసీఆర్‌కు జై కొట్టి.. మాగంటి గోపీనాథ్‌ను గెలిపించారు జూబ్లీహిల్స్‌లో. మ‌రి దుర‌దృష్టావ‌శాత్తూ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో మ‌న మ‌ధ్య‌లో లేకుండా పోయారు గోప‌న్న‌. ఇవాళ మాగంటి సునీత‌ను ఆశీర్వ‌దించి గెలిపిస్తార‌ని విశ్వ‌సిస్తున్నాన‌ని కేటీఆర్ అన్నారు