English | Telugu

తోట త్రిముర్తుల‌పై దాడి చేస్తావా? అంటూ వేట‌కొడ‌వ‌ళ్ళ‌తో న‌రికారు!

రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైఎస్సార్సీపీ నేత తోట త్రిమూర్తులు పై గతంలో చెప్పుతో దాడి చేసిన వ్యక్తి మేడి శెట్టి ఇజ్రాయిల్ పై మంగళవారం హత్యాయత్నం జరిగింది.
రామచంద్రపురం మండలం మసకపల్లి గ్రామంలో ఇజ్రాయిల్ పై దుండగులు కత్తులతో దాడి చేసి హత్యా యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో ఉన్న ఇజ్రాయిల్ ను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. త‌న‌పై దాడి జ‌రిగిన తీరును మేడిశెట్టి ఇశ్రాయేల్ వివ‌రించాడు.

రాడ్‌తో నెత్తి మీద కొట్టారు. వాళ్ళ‌ను తోసి ప‌రుగెడుతుంటే వెన‌క త‌రిమి త‌రిమి వేడ‌కొడ‌వ‌ళ్ళ‌తో న‌రికారు. ప్రాణాలు కాపాడుకోవ‌డానికి ప‌రుగెత్తుతూ కాలువ‌లో ప‌డిపోయాను. వాళ్ళు కూడా కాలువ‌లోకి దూకి న‌న్ను అంతం చేయాల‌ని చూశారు.
తోట త్రిముర్తుల‌పై దాడి చేస్తావా? ఈ రోజుతో నీవు స‌చ్చావు. అంటూ బూతులు తిట్టార‌ని బాధితుడు రోదిస్తూ చెప్పాడు.


పామ‌ర్రు పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ఇశ్రాయేల్ స్నేహితుడు రాజు ఫోన్ చేసి పిలిస్తే తాను వ‌చ్చిన‌ట్లు చెబుతున్నాడు. అప్ప‌ట్టికే దాడి చేయ‌డానికి కాచుకుని కూర్చున్న ర‌వ్వా నాగ‌భూష‌ణ, అత‌ని అనుచ‌రులు వేట కొడ‌వ‌ళ్ళ‌తో విచ‌క్ష‌ణార‌హితంగా నరికిన‌ట్లు బాధితుడు చెబుతున్నారు.

మేడిశెట్టి ఇశ్రాయేల్ గతంలో తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడిచేసిన ఘటనలో ముఖ్యుడు. కాకినాడ ఆసుప‌త్రికి త‌ర‌లించాం. భుజాంపై, త‌ల‌పై పెద్ద గాయాలున్నాయ‌ని పోలీసులు చెబుతున్నారు.

తోట త్రిమూర్తులు వర్గం వైసీపీలో చేరేందుకు వెళ్తుండగా కె.గంగవరం మండలం మసకపల్లికి చెందిన మేడిశెట్టి ఇజ్రాయెల్‌ అనే వ్యక్తి త్రిమూర్తులపై చెప్పుతో దాడికి దిగాడు. ఇందుకు సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. గతంలో తోట త్రిమూర్తులను వైసీపీలోకి చేరే సమయంలో దళితులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకునే తోట త్రిమూర్తులుపై ఇజ్రాయేలు దాడికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో అప్ప‌ట్లో వైరల్ అయింది.

ప్రశాంతమైన తూ.గో.జిల్లా K.గంగవరం మండలం మసకపల్లి గ్రామంలో మేడిశెట్టి ఇశ్రాయేల్ అనే వ్యక్తిపై కొందరు దుండగులు హత్యాయత్నం చేశారు. ఏది ఏమైనా ఇలాంటి భౌతికదాడులు సమాజానికి చాలా ప్రమాదం.. సత్వర విచారణ జరిపి నిందితులని అరెస్ట్ చేయాలి.