English | Telugu

ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి జడ్జి రామకృష్ణ లీగల్ నోటీసు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జడ్జి రామకృష్ణ మధ్య విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మంత్రి పెద్ది రెడ్డి తనపై కక్ష గట్టారని జడ్జి రామకృష్ణ పలుసార్లు ఆరోపించారు. ఈ క్రమంలో తన పరువుకు భంగం కలిగించారంటూ మంత్రి పెద్దిరెడ్డికి జడ్జి రామకృష్ణ లీగల్ నోటీసు పంపారు. మంత్రి పెద్దిరెడ్డి తీరుపై జడ్జి రామకృష్ణ మండిపడ్డారు. తనను జడ్జి కాదని మంత్రి వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తనకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే చట్టం ముందు దోషిగా నిలబడేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

సీఎం జగన్‌పై కూడా జడ్జి రామకృష్ణ విరుచుకుపడ్డారు. జగన్ ఓ క్రిమినల్ అని, 12 కేసులను ఎదుర్కొటుంన్నారని వ్యాఖ్యానించారు. ఆయన వెంట నడిచే మంత్రులు కూడా అదే వర్గానికి చెందిన వారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లే ఉద్దేశం తనకు లేదని రామకృష్ణ స్పష్టం చేశారు.