English | Telugu

బాబును చావ‌గొట్టకుండా విడిచిపెట్ట‌డం అదృష్ట‌మేన‌ట‌!

త‌ప్పించుకొని వ‌చ్చినందుకు చంద్ర‌బాబు సంతోష‌ప‌డాలని జేసీ అంటున్నారు.

విశాఖ జిల్లా పర్యటనకు వెళ్లిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేవ‌లం అడ్డుకున్నారు. చెప్పులు విసిరారు. అంత వ‌ర‌కే ఆగిపోయారు. ఇంకా ముందుకు వెళ్ళి చంద్ర‌బాబునాయుడిని కొట్టకపోవటం అదృష్టమే. చంద్ర‌బాబును పోలీసులే కింద పడేసి.. చావగొట్టకపోవటం సంతోషకరమని జేసీ దివాక‌ర్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు దుమారాన్ని రేపుతున్నాయి.

నోటి దూల తీర్చుకోవ‌డం జేసీ దివాక‌ర్ రెడ్డికి అల‌వాటే. తాజాగా చంద్ర‌బాబునుదే్ద‌శించి జేసీ కామెంట్స్ సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. అస‌లు జీసీ చంద్ర‌బాబును పొగుడుతున్నారా? లేక వ్యంగం ఎక్కువైందా అని టిడిపిలో చ‌ర్చ మొద‌లైంది. చంద్రబాబు విషయంలో మితిమీరిన ఉత్సాహంతో దివాక‌ర్‌రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నార‌ని టిడిపి నేత‌లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

అంతే కాదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన భేషుగ్గా వుంద‌ని, అతనెప్పటికి తమ వాడేనని జేసీ వ్యాఖ్యానించ‌డం టిడిపి శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా మారింది.