English | Telugu

'పౌరసత్వం'పై జగన్‌ డ్రామాలు

జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ), పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోంది'' అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓట్లకోసం సి.ఎం.జగన్ క్యాబినెట్ స‌మావేశంలో ఎన్‌పీఆర్‌పై చ‌ర్చించి అసెంబ్లీ స‌మావేశాల్లో తీర్మానం చేస్తామంటూ నాటకం ఆడుతున్నారన్నారు. ఎన్‌పీఆర్‌పై ప్రజల్లో ఆందోళనల దృష్ట్యా కేబినెట్‌లో ఆమోదించడమూ జగన్నాటకమేనని అన్నారు.