English | Telugu
యాంటీ బాడీని అభివృద్ధి చేశాం!ఇజ్రాయెల్ రక్షణ మంత్రి నెఫ్తాలీ బెన్నెట్
Updated : May 6, 2020
తమ పరిశోధకులు ఈ ఘనతను సాధించడం గర్వకారణమంటూ బెన్నెట్ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఐఐబీఆర్ పరిశోధన శాలలను రెండు రోజుల క్రితం బెన్నెట్ పరిశీలించిన విషయాన్ని తెలియజేస్తూ ఇజ్రాయెట్ పీఎంఓ ఒక ప్రకటన విడుదల చేేసింది.
రోమ్‌లోని స్పల్లంజానీ ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షల్లో ఈ వ్యాక్సీన్ ఎలుకల్లో యాంటీబాడీలను ఉత్పత్తిచేస్తున్నట్టు గుర్తించారు. ఇది మానవ కణాలపైనా సమర్థంగా పనిచేస్తుందని ఇటలీ పరిశోధకులు చెబుతున్నారు. నోవల్ కరోనా వైరస్ వ్యాక్సీన్‌కు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల్లో ఇదే అతిపెద్ద ముందడుగు అని దీన్ని తయారు చేస్తున్న టకిస్ సంస్థ సీఈవో లుయిగి ఆరిసిచియో పేర్కొన్నారు.
కరోనాను అడ్డుకునేందుకు మోనోక్లోనాల్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీని తయారు చేశారు. ఇది శరీరంలోకి వ్యాపించిన వైరస్ ప్రభావాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. కరోనా వైరస్ బారినపడి రోగుల శరీరంలోకి ఈ యాంటీబాడీస్‌ను పంపించినట్టయితే వైరస్ వ్యాప్తిని అడ్డుకుని నియంత్రిస్తుంది. ఇది ప్రయోగపూర్వకంగా నిరూపణ అయింది. ఇజ్రాయేల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ ఇజ్రాయేల్ ఇనిస్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ రీసెర్చ్ (ఐఐబీఆర్) కలిసి ఈ శుభవార్తను వెల్లడించాయి.