English | Telugu
ఒక్క తప్పు.. 130 కోట్ల మందికి శిక్ష
Updated : Mar 24, 2020
ఫ్లయిట్ దిగగానే క్వారంటైన్ చేస్తే ఇపుడు కోట్ల మంది ఇళ్లలో క్వారంటైన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా .. ఇది మన దేశంలో పుట్టిన వైరస్ కాదు కేవలం ఫ్లయిట్ ఎక్కి వచ్చిన ఒక వైరస్..
కరోనా వైరస్ పేరు చెపితేనే ప్రపంచం ఉలిక్కి పడుతోంది. ఇప్పటికే చైనా, ఇటలీ లలో వేలాది మంది మృత్యు వాత పడ్డారు. ఇపుడు భారత్ లో కరోనా సెకండ్ స్టేజ్ నడుస్తోందని నిపుణులు చెపుతున్నారు. ఐతే అసలు కరోనా భారత్ లోకి ప్రవేశించకుండా చేసే అవకాశం ఉందా.. ఈ ప్రశ్న ఎందుకు వస్తోందంటే ఇపుడు రాష్ట్రాలన్నీ దాదాపుగా లాక్ డౌన్ ప్రకటించేసాయి. దీనితో సామాన్యుడు బయటకు వచ్చి కుటుంబానికి కావలసిన నిత్యావసర వస్తువులు తీసుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే వెజిటబుల్స్ నుండి ఉప్పు, పప్పుల వరకు ముందుగానే స్టాక్ పెట్టుకున్న వారి పరిస్థితి పర్వాలేదు కానీ ఈ లాక్ డౌన్ తో చుక్కలనంటుతున్న ధరల తో సామాన్యుడు కొనే పరిస్థితి లేదు అలాగే షాపుల వద్ద క్రౌడ్ ఎక్కువైతే అది మరీ ప్రమాదకరమే కదా..
మరీ ముఖ్యంగా 130 కోట్ల ప్రజలను గడప దాటొద్దనే కంటే అసలు భారత్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల్లో వచ్చే ప్రతి ఒక్కరిని హౌస్ క్వారంటైన్ చేసే కంటే ఎయిర్ పోర్టు దగ్గరలోనే టెంపరరీ క్వారంటైన్ రూమ్స్ లో ఉంచి అవసరం ఐతే పారామిలటరీ దళాల పహారాలో వీటిని మైంటైన్ చేస్తే ఈ తిప్పలు తప్పేవి కదా ఎందుకంటే ఇపుడు హౌస్ క్వారంటైన్ విధించ బడిన వాళ్ళు 14 రోజుల క్వారంటైన్ పాటించకుండా ఇష్టం వచ్చినట్లుగా జనం లో కలిసి తిరిగేస్తున్నారు. ఒక వేళ ఫారిన్ నుండి వచ్చిన వ్యక్తి బుద్ధిగా హౌస్ క్వారంటైన్ పాటించినా ఇపుడు వెలుగు చూస్తున్న కేసులను బట్టి వారి ఇంటి నుండి మరో వ్యక్తికి కూడా ఈ వైరస్ వ్యాపిస్తున్నట్లుగా తెలుస్తోంది. దింతో ఈ వైరస్ వ్యాప్తి ని ఎలా అదుపు చేయాలా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. ఒక వైపు లాక్ డౌన్ విధించి బయటకు రావద్దు అన్నా వినిపించుకొని జనాన్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ పోలీసులు పహారా ఉన్నా మాట వినని జనం.
దీనికి అల్తర్నేటివ్ గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర్లోనే క్వారంటైన్ రూమ్స్ ఏర్పాటు చేసి ఫారిన్ నంది వచ్చే ప్రతి ఒక్కరు తప్పని సరిగా ఈ రూముల్లోనే 14 రోజుల క్వారంటైన్ పూర్తీ చేసి వెళ్లాలని డిక్లెర్ చేసి ఉంటె ఈ రోజు నూట ముప్పయి కోట్ల మంది కి ఇబ్బందులు తప్పేవి కదా. అలాగే ఈ రూల్ ముందే డిక్లెర్ చేస్తే గట్టిగ అవసరం ఉన్నవాళ్లే ఇండియా కు వచ్చేవారు. దింతో ఫ్లోటింగ్ కూడా తగ్గేది. మరి ఎందుకో ప్రభుత్వాలు ఈ దిశలో చర్యలు తీసుకోలేదు .. దేశంలోని 30 ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల వద్ద ఇటువంటి పటిష్టమైన చర్యలు తీసుకుని ఉంటె ఈ రోజు 130 కోట్ల మంది బిక్కుబిక్కు మనకంటూ బ్రతకాల్సిన పరిష్టితి వచ్చేది కాదు కదా.