English | Telugu
సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడకుండానే ఫైనల్స్ కి వెళ్లిన భారత్
Updated : Mar 5, 2020
మహిళల టీ-20 ప్రపంచ కప్ లో భారత్ జట్టు సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడకుండానే ఫైనల్స్ కు చేరింది. నేడు సిడ్నీలో ఇంగ్లండ్ తో భారత్ సెమీస్ ఆడాల్సివుండగా, వర్షం కారణంగా ఒక్క బాల్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. దీంతో, గ్రూప్ దశలో మెరుగైన పాయింట్లు కలిగివున్న భారత్ జట్టు.. ఫైనల్స్ కు క్వాలిఫై అయిందని మ్యాచ్ రిఫరీ ప్రకటించారు. కాగా, మరో సెమీఫైనల్ సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టుతో భారత్ ఫైనల్ లో తలపడనుంది.