English | Telugu

జూన్ 1 నుంచి రోజూ 200 రైళ్లు

జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా రోజుకు 200 నాన్ ఏసీ, సెకెండ్ క్లాస్ స్పెషల్​ ప్యాసింజర్ రైళ్లు నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఇప్పుడున్న శ్రామిక్ స్పెషల్​, ఎయిర్ కండిషన్డు స్పెషల్​ ట్రయిన్లకు అదనంగా ఈ రైళ్లు నడుస్తాయని.. చిన్న నగరాలు, పట్టణాల ప్రయాణికుల అవసరాలను ఇవి తీరుస్తాయని తెలిపింది. ఇవి రాకపోకలు సాగించే మార్గాలు షెడ్యూల్ ను త్వరలో వెల్లడించనున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది.

ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. అన్ని కేటగిరీల ప్యాసింజర్లు ఆన్ లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే బుకింగ్ ప్రారంభమవుతుందని పీయూష్ గోయల్​ ట్వీట్ చేశారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ నుంచి పలు రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేక రైళ్లను రైల్వే నడుపుతున్న సంగతి తెలిసిందే. వీటికి తోడు.. వలస కూలీలను తరలించే రైళ్లు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే శ్రామిక్ రైళ్లను రెట్టింపు చేశామని, మంగళవారం రాత్రి నుంచి 200 శ్రామిక రైళ్లు నడుపుతున్నట్లు తెలిపారు.