English | Telugu
దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్ట్ మార్టం చేయనున్న ఢిల్లీ ఫోరెన్ సీక్ అధికారులు .....
Updated : Dec 21, 2019
దిశ నిందితుల మృతదేహాలను వారి కుటుంబాలకు ఎప్పుడూ అప్పగిస్తారనే ఉత్కంఠరేపుతోంది. సామాజిక కార్యకర్త పిటిషన్ తో నిన్న హై కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మృతదేహాలను ఎప్పుడూ అప్పగిస్తారని ప్రభుత్వం తమ అభిప్రాయం తెలపాలని హై కోర్టు ఆదేశించింది. దిశ నిందితుల మృతదేహానికి రీపోస్ట్ మార్టం చెయ్యటానికి ఆదేశాలిచ్చేందుకు హైకోర్ట్ సిద్ధమైనట్టుగా తెలిపింది. ఇందు కోసం ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ నిపుణులు నేడు గాంధీ ఆస్పత్రికి వెళ్లి రీపోస్టుమార్టం చేస్తారని సమాచారం. ఎన్ కౌంటర్ పై అనుమానం వ్యక్తం చేస్తూ ఈ నెల17న మహిళా సంఘాలు సుప్రీం కోర్టుకు వెళ్లాయి. అయితే దీని పై హై కోర్టులో తేల్చుకోవాలని మృతదేహాలను భద్రంగా వుంచాలని సుప్రీం కోర్టు చెప్పింది. అయితే మృతదేహాలకూ రీపోస్టుమార్టం నిర్వహించాలని హై కోర్టు భావిస్తుంటే అవసరం లేదని ఏజీ తెలిపారు.
ఇవాళ ఉదయం 10:30 లోపు ప్రభుత్వ అభిప్రాయం తెలపాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు మృతదేహాల పరిస్థితి పై నివేదిక ఇవ్వాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ను హై కోర్టు ఆదేశించింది.దిశ అత్యాచారం నిందితుల్లో ఒకరి భార్య మైనర్ అని సమాచారం. నిందితుడు చెన్న కేశవులు భార్య వయస్సు 13 ఏళ్లని అధికారుల విచారణలో తేలింది. నారాయణ పేట జిల్లా బాలల సంరక్షణ విభాగం ప్రాథమిక విచారణ జరిపింది. ఆ బాలికకు సంబంధించిన వివరాలను పాఠశాల నుంచి సేకరించారు. అయితే ఆమె వయస్సు 13 సంవత్సరాల 6 నెలలుగా గుర్తించారు. రిజిస్టర్ లో 2006 జూన్ 15 న పుట్టినట్లుంది. ఆమె ప్రస్తుతం 6 నెలల గర్భవతి కూడా, దీంతో చెన్నకేశవులు తల్లితండ్రులతో అధికారులు మాట్లాడారు. బాలిక 18 ఏళ్లు వచ్చే వరకు బాలల సదనంలో రక్షణ కల్పిస్తామని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు, అందుకు వారు నిరాకరించారు.చెన్న కేశవులు భార్య మైనర్ కావడం చేత వారి చేసింది తప్పు అని పోలీసులు హెచ్చరించారు.వాళ్ళ కోడలికి గట్టి భద్రత కూడా కలిపిస్తామన్నారు.వారి మృత దేహాల పై ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలనిహైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.