English | Telugu
ప్రముఖ సినీ నటి,యాంకర్ల ఇళ్ళల్లో అకస్మాత్తుగా సోదాలు నిర్వహించిన జీఎస్టీ అధికారులు.....
Updated : Dec 21, 2019
ప్రముఖ సినీ నటి లావణ్య త్రిపాఠి, యాంకర్లు సుమ కనకాల, అనసూయ భరద్వాజ్ ఇళ్ళల్లో శుక్రవారం జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీని ఎగ్గొట్టిన కేసులకు సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ సోదాలు చేపట్టారు. ఉదయం నుంచి తనిఖీలు జరిగాయి. విరిగి ఇళ్లతో పాటు నగరంలోని మొత్తం 23 చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. కోట్లలో సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీని ఎగ్గొట్టారన్న ఆరోపణలతో సోదాలు జరిగాయి. జూబ్లీహిల్స్ లోని లావణ్య త్రిపాఠి ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాలు జరుగుతున్న విషయం తెలుసుకున్న ఆమె సినిమా షూటింగ్ ను రద్దు చేసుకొని ఇంటికి చేరుకున్నారు. అదే సమయంలో మణికొండలోని యాంకర్ సుమ కనకాల, బంజారాహిల్స్ లోని అనసూయ భరద్వాజ్ ఇళ్లల్లో తనిఖీ చేశారు. సినీ నటి యాంకర్ల ఇళ్లతో పాటు నగరం లోని చిట్ ఫండ్ కంపెనీలు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, భవన నిర్మాణ సంస్థలు, సాఫ్ట్ వేర్ సంస్థలు, ఓవర్సిస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో ఫిట్ నెస్ సెంటర్ లో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎంటర్ టైన్ మెంట్ తదితర ఇరవై మూడు సంస్థలలో ఏక కాలంలో ఈ సోదాలు జరిగాయి.
కొన్ని సంస్థల్లో లావణ్య త్రిపాఠి, సుమ, అనుసూయ పెట్టుబడులు పెట్టారని ఆ సంస్థల పై సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీ ఎగ్గొట్టిన ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. ఆ సంస్థల్లో సోదాలలో భాగంగానే లావణ్య త్రిపాఠి, సుమ, అనుసూయ ఇళ్లల్లో సోదాలు జరిగినట్టు తెలిసింది. సాధారణంగా సినీ నటులు వ్యక్తిగతంగా సర్వీస్ టాక్స్ జిఎస్టి చెల్లించే నిబంధనలు ఉండవు. వీరి భాగస్వామ్యం ఉన్న సంస్థలు గతంలో సర్వీస్ ట్యాక్స్ ఇప్పుడు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.ఆయా పెట్టుబడుల్లో భాగస్వామ్యం ఉన్న కారణంగా వీరి ఇళ్ళల్లో కూడా సోదాలు నిర్వహించినట్లు సమాచారం.