English | Telugu

జేసీ అనుచిత వ్యాఖ్యలు టీడీపీని ఇరకాటంలోకి నెట్టాయా?

అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకించుకుంటానంటూ మాజీ ఎంపి జెసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యల పై మండిపడిన పోలీసు అధికారుల సంఘం క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. జేసీ వెనక్కు తగ్గక పోవడంతో అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో జేసీ వ్యాఖ్యల పై ఫిర్యాదు చేశారు. జేసీ పై ఐపీసీ సెక్షన్ 153ఎ, 506 కింద కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు దీని పై వివరణ ఇచ్చిన చేసి తాను పోలీస్ వ్యవస్థనంతటిని అనలేదని, కొందరు అధికారులను ఉద్దేశించి విమర్శించినట్లు తెలిపారు. మరో వైపు జేసీ వ్యాఖ్యల పై ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసు బూట్ల వంటి యుద్ధంలో ఆయుధాలని వాటిని మేము ముద్దు పెట్టుకుంటామన్నారు. పోలీస్ అమరవీరుల బూట్లను తుడిచి మాదవ్ వాటిని ముద్దాడారు.

పోలీసులంటే హీరోలని వారిలో ఒకరైన నేను ఒక ట్రైల్ వేస్తే ఎంపీని అయ్యానన్నారు. పోలీసుల పై మీసం తిప్పితే మీరు పతనావస్థకు చేరుకుంటారని అన్నారు. గతంలో ఏం జరిగిందో దృషి పెట్టుకోవాలని అప్పడే మరచిపోయావా అంటూ సెటైర్లు కూడా వేశారు. జేసీ వ్యాఖ్యలు తెలుగు దేశం పార్టీ సైతం ఇరకాటంలోకి నెట్టాయి. చంద్రబాబు ముందే జేసీ పోలీసుల పై అభ్యంతరకరమైన భాషను వాడుతూ చేసిన వ్యాఖ్యల చర్చనీయాంశమయ్యాయి.జేసీ వాడిన పాదజాలాన్ని తప్పుపడుతూ పలువురు నేతలసైతం మండి పడ్డారు. చంద్రబాబు ముందే వ్యాఖ్యానించిన ఈ వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పించాలంటూ పోలీసు అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం ఏ బాబుకు ఇప్పుడు పెద్ద తల నొప్పిగా మారింది.దీని పై బాబు ఏం చేయబోతున్నారన్నది వేచి చూడాలి.