English | Telugu
ఇది లక్ అంటే.. గూగుల్ పేలో 3 వేలు పంపితే లక్ష క్యాష్ బ్యాక్ వచ్చింది!
Updated : Feb 29, 2020
ఒకప్పుడు మనీ ట్రాన్స్ ఫర్ చేయాలంటే.. ఓ విధానం ఉండేది, కాస్త సమయం పట్టేది. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్, యాప్ ఉంటే చాలు.. నిమిషంలో మనీ ట్రాన్స్ ఫర్ చేయొచ్చు. ఇలా మనీ ట్రాన్స్ ఫర్ ని ఇంత సులభం చేసిన యాప్స్ లో గూగుల్ పే ఒకటి. ఈ యాప్ లో మనీ ట్రాన్స్ ఫర్ చేస్తే రివార్డ్స్ కూడా వస్తుంటాయి. అయితే, ఎక్కువ సార్లు 'బెటర్ లక్ నెక్స్ట్ టైం', అప్పుడప్పుడు పదుల్లో, వందల్లో.. ఎప్పుడో ఒకసారి వేలల్లో కాష్ బ్యాక్ వస్తుంటాయి. వేలల్లో క్యాష్ బ్యాక్ రావడం అనేది చాలా అరుదు. కానీ తాజాగా ఓ వ్యక్తికి మాత్రం ఏకంగా లక్ష రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది.
అనంతపురం జిల్లా పెనుకొండకి చెందిన సూర్య ప్రకాశ్ అనే యువకుడు.. గూగుల్ పే ద్వారా మూడు వేల రూపాయలను తన స్నేహితునికి పంపగా, అతనికి ఏకంగా రూ. 1,00,000 క్యాష్ బ్యాక్ వచ్చింది. మొదట షాక్ అయ్యాడు, నమ్మలేకపోయాడు. కానీ, కాసేపటికే సూర్య ప్రకాశ్ బ్యాంకు ఖాతాకు లక్ష జమ అయినట్టు మెసేజ్ రావడంతో ఇక అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ ఆనందాన్ని సన్నిహితులతో పంచుకున్న సూర్య ప్రకాష్.. అదే ఆనందంతో తను తీసుకున్న రూ.80 వేల గోల్డ్ లోన్ అప్పుని వెంటనే తీర్చేశాడు. మొత్తానికి అందరినీ 'బెటర్ లక్ నెక్స్ట్ టైం' అంటూ ఆడుకునే గూగుల్ పేతో సూర్య ప్రకాష్ కి మాత్రం బాగానే లక్ కలిసొచ్చింది.