English | Telugu
ఒంగోలులో పూర్తిస్థాయి లాక్‌డౌన్
Updated : Jun 19, 2020
ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు 267 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఇటీవల కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న కొత్తగా 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒంగోలులో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు రావడం, కరోనా అనుమానితులు వందల సంఖ్యలో ఉండటంతో పరిస్థితి చేయిదాటిపోయేలా ఉంది. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు నగరంలో కరోనా వ్యాప్తిని నిలువరించడానికి పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు.