English | Telugu
వైసీపీ నేతలకు హైకోర్టు నోటీసులు
Updated : May 26, 2020
న్యాయమూర్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల పై ఓ న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ కోర్టు తీర్పులపై వివాదాస్పద వ్యాఖ్యల్ని క్షుణ్ణంగా పరిశీలించిన హైకోర్టు.. మొత్తం 49 మందికి నోటీసులు జారీ చేసింది. వారిలో వైసీపీ నేతలు బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు.
డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. దీనిపై ఎంపీ నందిగామ సురేష్, ఆమంచి కృష్ణమోహన్ న్యాయమూర్తుల పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో వారికి కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.