English | Telugu

కొత్త రిజ‌ర్వేష‌న్ లెక్కింపు విధానంలో ఓ.సి.ల‌కు అన్యాయం!

స్థానిక సంస్థ‌ల రిజ‌ర్వేష‌న్ ల‌కు సంబంధించిన గ‌తంలో వున్న లెక్కింపు విధానాన్ని పూర్తిగా మారుస్తూ 559, 560 జీవోలు ప్ర‌భుత్వం జారీ చేసింది. పంచాయతీ రాజ్ చట్టం1994 పెట్టిన తరువాత, గత 25 సంవత్సరాలుగా, అవలంభించిన విధానాన్ని తప్పించి, పూర్తి భిన్నంగా, ఈ జీవో లను విడుద‌ల చేశారు.

బహుశా భారత దేశంలో, ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి విధానం లేదు. దీనిపై రాజ‌కీయ పార్టీలు అంత‌గా దృష్టి పెట్ట‌లేదు. రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా మార్చిన విధానం, తేడాల‌ను గమనించ‌లేదు.

ఈ జీవోల్లో తెలిపిన‌ట్లు కొత్త విధానంలో మేజర్ పంచాయితీలన్నీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో కి వెళతాయి. ఆ తదుపరి పెద్ద పంచాయతీలు బి.సి. క్యాటగిరిలోకి వెళతాయి. మిగిలిన చిన్న పంచాయితీలు మాత్రమే జ‌న‌ర‌ల్ గా మిగులుతాయి. ఒక వేళ 100% ఎస్సీ జ‌నాభా ఉన్న చిన్న పంచాయితీలు కూడా జ‌న‌ర‌ల్‌ గా మిగులుతాయి.

అంతే కాదు 100% బి.సి.లు ఉన్న చిన్న పంచాయితీలు కూడా జ‌న‌ర‌ల్‌గా మిగులుతాయి. ఆ చిన్నపంచాయితీల్లో ఓసీ లు నిలబడే అవకాశం ఉండదు. ఇందువలన ఓసీ లు నిలబడే అవకాశం ఉండదు. ఓసీలు ఇక్క‌డ న‌ష్ట‌పోవ‌ల్సిందే. ఇదొక రాజకీయ ఎత్తుగడలో భాగం. విపక్ష రాజకీయ పార్టీలు, ఈ తేడాని గమనించలేదు.

గత 25 సంవత్సరాలుగా ఎస్టీ, ఎస్సీ, బి.సి.ల‌ ల, పంచాయతీ జ‌నాభా/ పంచాయతీ జ‌నాభా తో ప‌ర్సంటేజ్‌లు తయారు చేసి, వాటి ఆధారంగా, ఎక్కువ ప‌ర్సంటేజ్ ఉన్న పంచాయతీలను, సంబంధిత, క్యాటగిరీకి కేటాయించేవారు. ఇప్పుడు ఈ కొత్త జోవో ల ద్వారా, లెక్కింపు విధానాన్ని పూర్తిగా మార్చారు.

ఈ కొత్త విధానం ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బిసి పంచాయతీ జ‌నాభా/ఎస‌్టీ, ఎస్సీ, బి.సి. మండ‌ల జ‌నాభాతో ప‌ర్సంటేజ్‌లు త‌యారు చేసి వాటిలో ఎక్కువ శాతం ఉన్న పంచాయతీలను కేటాయిస్తున్నారు.

ఇది గత25 సంవ‌త్స‌రాలుగా అవలంభిస్తున్న విధానానికి భిన్నంగా ఉంది. ఈ తేడాను గమ యించగలరు.
ఈ విధానంలో ఓ.సి.లు వారికి చెందవలసిన అవకాశాలు కోల్పోతున్నారు.

కేవలం పంచాయితోల్లోనే కాదు, ఎం.పి.టి.సిలూ, జ‌డ్పీటిసిలు, ఎం.పి.పిలు, జ‌డ్పీ ఛైర్‌ప‌ర్స‌న్ మునిసిపల్ కౌన్సిలర్లు, చైర్మన్స్, అన్నింటిలో మార్పులు వస్తాయి.

స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో బీసీలను వైసీపీ దారుణంగా మోసం చేసిందని కొన్ని జిల్లాల్లో రిజర్వేషన్లలో సగానికి పైగా కోతపెట్టిందని మండిపడ్డారు చంద్రబాబు. జడ్పీటిసి స్థానాల్లో నెల్లూరులో 13%, ప్రకాశంలో 19.64%, పశ్చిమ గోదావరిలో 18.75%, కృష్ణా 20.41%, తూర్పుగోదావరి 20.97%, విశాఖలో 20.51% కు బీసీలను పరిమితం చేశారని అన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అందుకే ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి 34% పైగా స్థానాలను బీసీలకు కేటాయించామన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని పరిరక్షించుకునేందుకు బీసీలందరూ ఏకంకావాలని పిలుపునిచ్చారు.