English | Telugu
ఎన్నికల వాయిదాపై గుసగుసలు రుసరుసలు!
Updated : Mar 11, 2020
కొన్ని వివాదాల కారణంగా 3 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీల్లో ఎన్నికలను వాయిదా వేశారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్, అర్బన్ డెవలోపమెంట్ అథారిటీలో పలు గ్రామ పంచాయతీలను ప్రభుత్వం విలీనం చేసింది. అలాంటి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. అమరావతి పరిధిలోని గ్రామాల్లో పంచాయతీలలో కూడా ఎన్నికలు నిలిపివేశారు. అమరావతి క్యాపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినందున ఆయా గ్రామాల్లో పంచాయతీ, ఎంపిటిసి, జడ్పీటీసిలకు ఎన్నికలు నిర్వహించడం లేదు.
ఎన్నికలు వాయిదా వేసిన ప్రాంతల గురించి రాష్ట్రంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం లో ఎలక్షన్ లేదు. రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం లో ఎన్నికలు వాయిదా. బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరంలో ఎన్నికలు వాయిదా. జనసేన పవన్ కళ్యాణ్ ఓడిపోయిన భీమవరంలో కూడా ఎన్నికలు వాయిదా. నిమ్మల రామానాయుడు గారి నియోజకవర్గం పాలకొల్లు లో ఎన్నికలు వాయిదా. నారా లోకేష్ మంగళగిరి లో ఎన్నికలు వాయిదా. దివంగత డా.కోడెల శివ ప్రసాద్ గారి నరసరావుపేట లో ఎన్నికలు వాయిదా. తమ్మినేని సీతారామ్ (స్పీకర్) నియోజకవర్గం ఆముదాలవలస లో ఎన్నికలు వాయిదా. పేదల రేషన్ బియ్యం స్కామ్ చేసిన ఎవడమ్మ మొగుడి నానీ నియోజకవర్గం గుడివాడ లో ఎన్నికలు వాయిదా. చివరికి శుక్రవారం కోర్టు హాజరుదారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఇల్లు ఉన్న 'తాడేపల్లి'లో కూడా ఎన్నికలు వాయిదా పడడం వెనుక మతలబు ఏమిటని రాష్ట్ర ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.