English | Telugu

అడవి పంది దాడిలో గిరిజన బాలిక మృతి!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల అటవీ ప్రాంతంలో అడవి పంది దాడిలో గిరిజన బాలిక మృతి చెందిన సంఘటన పై అటవీశాఖ సంతాపాన్ని తెలియచేసింది. సంఘటన విషయం తెలుసుకున్న అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ( పి సి సి ఎఫ్) ఆర్. శోభ జిల్లా అటవీ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతి చెందిన బాలిక కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలిపారు. గురువారం బాలిక కుటుంబాన్ని పరామర్శించి, నిబంధనల ప్రకారం వారికి నష్టపరిహారాన్ని (5 లక్షలు - అటవీ శాఖ తరపున అందించాలని జిల్లా అధికారులను పి సి సి ఎఫ్ ఆదేశించారు.

అటవీ ప్రాంతాలకు వెళ్లే వారు, అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం అడవుల లోపలికి వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పి సి సి ఎఫ్ కోరారు. జంతువుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అదే విధంగా అటవీ ప్రాంతాల్లో నిఘాను పటిష్టంగా కొనసాగించాలని అటవీ ప్రాంతాల జిల్లాల అధికారులను సిబ్బందిని ఉన్నతాధికారులు ఆదేశించారు. అటవీ శాఖ తరపున అందించాలని జిల్లా అధికారులను పి సి సి ఎఫ్ ఆదేశించారు.