English | Telugu

టీటీడీ నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

తిరుమలలో టీటీడీ బోర్డు నిబంధనలను మాజీ సీఎం జగన్ మేనమామ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఉల్లంఘించారు. శ్రీవారి ఆలయం ముందు నిబంధనలకు విరుద్ధంగా మీడియాతో ఇష్టానుసారంగా రాజకీయ వ్యాఖ్యలు ఆరోపణలు చేశారు. తిరుమలలో దైవ నామస్మరణ మినహా రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని టీటీడీ బోర్డు తీర్మానించింది.

దీంతో రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలపై టీటీడీ సభ్యులు పరిశీలిస్తున్నారు. ఆయన చర్యల సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ ఇష్టానుసారం రాజకీయ వ్యాఖ్యలు చేశారు. అతని వ్యాఖ్యలను టీటీడీ విజిలెన్స్‌ విభాగం పరిశీలిస్తోంది. బోర్డు తీర్మానాన్ని ఉల్లంఘించినందుకు అతనిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.