English | Telugu
సోషల్ మీడియా విమర్శలు బాధించాయి: డొక్కా
Updated : Mar 9, 2020
ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ రాశారు. సోషల్ మీడియాలో తనపై వచ్చిన విమర్శలు బాధించాయన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే తాను మానసికంగా వైసీపీ వైపు మొగ్గు చూపానని... కానీ వైసీపీ అధిష్టానంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదన్నారు. ఆయన లేఖ ఈ దిగువున ఇస్తున్నాం...
" నేను డొక్కా మాణిక్య వరప్రసాద్ రాస్తున్న బహిరంగ లేఖ...'!
'మిత్రులు, శ్రేయోభిలాషులకు... నేను డొక్కా మాణిక్య వరప్రసాద్ రాస్తున్న బహిరంగ లేఖ...' అంటూ ప్రారంభించిన ఆయన, సామాజిక మాధ్యమాల్లో తనపై వచ్చిన విమర్శలు బాధించాయని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే తాను మానసికంగా వైసీపీ వైపు మొగ్గు చూపానని, అయితే, ఆ పార్టీ నేతలతో మాత్రం చర్చించలేదని స్పష్టం చేశారు.
తాను ఏ పార్టీలో ఉన్నా, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని డొక్కా వ్యాఖ్యానించారు. తనపై నీతి బాహ్యమైన, చౌకబారు విమర్శలు చేస్తున్నారని, వాటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తన ప్రవర్తన ప్రజలకు సుస్పష్టమని అన్నారు. రాజకీయ పార్టీ అన్నది ప్రజా సేవకు ఓ వేదిక మాత్రమేనని, ఆ వేదిక ద్వారా తనదైన శైలిలోనే ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ రాసిన లేఖను మీరూ చూడవచ్చు. తాను ఏ పార్టీలో ఉన్నా ప్రజాసేవ కోసమే పని చేస్తానని మాణిక్యవరప్రసాద్ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నుంచి టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. రాజీనామా చేస్తున్నట్లు అప్పట్లో ఆయన ప్రకటించారు. అయితే రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది..? ఎందుకు పార్టీకి దూరమవుతున్నారు..? వైసీపీలో చేరుతున్నారా..? 2019 ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది..? ఇలా పలు విషయాలపై బహిరంగ లేఖ రూపంలో డొక్కా నిశితంగా వివరించారు.
మొత్తానికి, మున్సిపల్ ఎన్నికల కీలక సమయం లో డొక్కా తన అభిప్రాయాన్ని నేరుగా పంచుకోవటం, ప్రస్తుతం చర్చనీయాంశం గ మారింది. డొక్కా సామాజిక వర్గ ఓట్ల కోసమే, వై ఎస్ ఆర్ సి పీ ఈ డ్రామా కి తెర తీసిందని తెలుగు దేశం ఆరోపిస్తోంది.