English | Telugu

కిరసనాయిలు సలహా ప్రకారం నడుచుకో.. బాబుకి విజయసాయి సూచన

వై ఎస్ ఆర్ సి పీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి దూకుడు పెంచారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిఘా యాప్ ఆవిష్కరణ తర్వాత , ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యవహరించిన శైలిపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. "రెండేళ్ల క్రితం జరగాల్సిన స్థానిక ఎన్నికలకు అడ్డంకులు సృష్టించారు. ఇదీ చాలక ఇంత హడావుడి ఏంటని ప్రశ్నిస్తున్నారు. డబ్బు పంపిణీ లేకపోతే పోటీ చేసేది లేదని ఇప్పటికే చేతులెత్తేశారు. దివాళాకోరు రాజకీయాలెందుకు బాబూ అంటూస్థానిక సంస్థల ఎన్నికల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటికే ఆయన చేతులెత్తేశారంటూ ట్వీట్ చేశారు.

.'రెండేళ్ల క్రితం జరగాల్సిన స్థానిక ఎన్నికలకు అడ్డంకులు సృష్టించింది చాలక ఇంత హడావుడి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మద్యం, డబ్బు పంపిణీ లేక పోతే మేం పోటీ చేసేది లేదని ఇప్పటికే చేతులెత్తేశారు. దివాళాకోరు రాజకీయాలెందుకు బాబూ. నీవల్ల కాదు గానీ కుల మేధావి కిరసనాయిలు సలహా ప్రకారం నడుచుకో' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.