English | Telugu
మారుతీరావు పోస్టుమార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు!
Updated : Mar 9, 2020
విషం కలిపిన గారెలు తిన్నందుకే మారుతీరావు మరణించారు. మారుతీరావు ఒంటిపై ఎటువంటి గాయాలు లేవు. విషం కారణంగా రక్త ప్రసరణ ఆగిపోయి శరీరంలోని అవయవాలన్నీ పని చేయకుండా ఆగిపోయాయి. ఈ క్రమంలోనే బ్రెయిన్ డెడ్ అయి ఆ తర్వాత గుండెపోటు వచ్చినట్టు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మారుతీరావు ఆత్మహత్య ఉదంతంలో కొత్త విషయం వెలుగుచూశాయి. ఆయన ఆత్మహత్య పోస్టుమార్టం నివేదిక తాజాగా బహిర్గతమైంది. మారుతీరావు తిన్న గారెల్లో విషం కలిసినందువల్లే శరీరం రంగు మారిందని డాక్టర్లు రిపోర్ట్‌లో రాశారు. హైదరాబాద్ లోని ఓ వైశ్యభవన్ లో ఆత్మహత్య చేసుకున్న అమృతరావు డెడ్ బాడీకి హైదరాబాద్ లోనే పోస్టుమార్టం జరిగింది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు. మారుతీరావు మృతిపై కూతురు అమృత తొలిసారి స్పందించింది. తన తండ్రి సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదంటూ పేర్కొంది. తన విషయంలో పశ్చాత్తాపంతో కాకుండా. ఇతర కారణాలతో చనిపోయి ఉండొచ్చని తెలిపింది. కుటుంబంలో ఆస్తి తగాదాలున్నాయని పేర్కొంది.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 24 ఏళ్ల యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో నిందితుడైన తిరునగరు మారుతీరావు మృతి చెందారు.
తన కుమార్తె అమృతను షెడ్యూల్డ్ కులానికి చెందినప్రణయ్ ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంగా ప్రణయ్‌ను 2018 సెప్టెంబర్ 14వ తేదీన మారుతీరావు హత్య చేయించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జైలుకు వెళ్లి, ఆరు నెలల కిందట బెయిల్‌పై విడుదలైన మారుతీరావు.. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారని ఖైరతాబాద్ పోలీసులు తెలిపారు. అయితే, అనుమానాస్పద మృతి కింద కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.