English | Telugu
నన్ను కూడా అక్కడే చంపండి.. నిందితుడు చెన్నకేశవులు భార్య
Updated : Dec 6, 2019
హైదరాబాద్ లో హత్యాచారానికి గురై మరణించిన దిశ హంతకులను సైబరాబాద్ పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఐతే ఈ నిందితులలో ఒకరైన చెన్నకేశవులు భార్య ఎన్‌కౌంటర్ వార్త తెలిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ తనను కూడ తన భర్తను ఎన్‌కౌంటర్ చేసిన ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చి చంపాలని ఆవేదన వ్యక్తం చేసింది. మీ ఆయనను మళ్ళీ పంపిస్తామని చెప్పిన పోలీసులు ఇలా ఎందుకు ఎన్‌కౌంటర్ చేశారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. మా అయన లేకుండా నేను బతకను అంటూ ఆమె రోదించింది.