English | Telugu
ఘోరమైన మూడనమ్మకం... సూర్య గ్రహణం
Updated : Dec 26, 2019
నేడు సంపూర్ణ సూర్య గ్రహణం అన్న సంగతి అందరికి తెలిసిందే. ఏడాది చివరిలో వచ్చిన ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ఎందరో ఆశక్తి చూపించారు. కాగా, ఒకవైపు చంద్రుడి పైకి మనిషిని పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు సూర్యగ్రహణం వేళ మూఢ విశ్వాసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కర్ణాటకలో అమానుష ఘటన చోటు చేసుకుంది. సూర్యగ్రహణం వేల మట్టిలో పాతిపెడితే అంగవైకల్యం పోతుందనే మూఢనమ్మకంతో ఒక దివ్యాంగుడైన అబ్బాయిని మెడవరకూ మట్టిలో పాతి పెట్టారు. గ్రహణం పూర్తయ్యేంత వరకు ఆ అబ్బాయిని అలాగే మట్టిలో ఉంచారు. ప్రజలు ఇలాంటి మూఢ విశ్వాసాలను విడిచి పెట్టాలని జన విజ్ఞాన వేదిక సభ్యులు కోరుతున్నారు.
సూర్య గ్రహణం నాడు ప్రతి ఒక్కరూ కూడా కొన్ని రకాల మూఢ నమ్మకాలతో ఉంటారన్న విషయం అందరికి తెలిసిందే. గ్రహణం పూర్తి అయ్యే వరకు ఎవరూ కూడా ఎటువంటి భోజనాన్ని తీసుకోరు,కనీసం భోజనాన్ని తయారు చేసుకోకూడదు, బయటకు వెళ్లకూడదు అనే నమ్మకాలు చాలానే ఉన్నాయి. కర్నాటక రాష్ట్రం కలబుర్గి అనే ప్రాంతంలో ఎప్పుడూ మూఢనమ్మకాల చర్య కొనసాగుతూ ఉంటుంది. ఆ ప్రాంతంలో ముఖ్యంగా కొంత మంది అంగవైకల్యం ఉన్న చిన్నారులని, ఇక డాక్టర్ ల వల్ల కూడా వారికి ఎటువంటి ప్రయోజనం లేదు, జన్మించినప్పటి నుంచి వారికి అంగవైకల్యం ఉన్న చిన్నారులకు అనగా 15 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరినీ కూడా.. నాగుల చవితి నాడు ఆ పుట్ట దగ్గరకు వెళ్లి పాలు పోస్తామో అలాంటి ప్రాంతానికి తీసుకెళ్లి పిల్లల్ని అదే పుట్టలో కప్పిపెట్టి ఒక అరగంట పాటు ఉంచితే వాళ్ళ అంగవైకల్యం సరిగ్గా నయమవుతుంది అన్న ఊహాగానాలు ఉన్నాయి. పిల్లలకి ఎటువంటి అపాయం వుండదు, ఆరోగ్య పరిస్థితి కుదుట పడుతుంది అని చెప్పి ఒక మూఢనమ్మకం తోనే పిల్లల్ని కలబుర్గి లోని ప్రాంతానికి తాజ్ సుల్తానాపూర్ అనే ఒక ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ పెట్టటం జరిగింది.
ఈ రోజు సూర్యగ్రహణం కాబట్టి పిల్లల్ని పది గంటల లోపు అంటే ఉదయం తెల్లవారుజాము నుంచి పది గంటల లోపు పిల్లల్ని అలా పెట్టడం జరిగితే వారి అంగవైకల్య లోపం నుంచి బయటపడతారు అనేది ఒక మూఢ నమ్మకంగా ఉంది. అయితే మొత్తం ఒక ఐదు మంది చిన్నారులతో పాటు ఒక 18 సంవత్సరాలు నిండిన ఒక అబ్బాయిని కూడా అందులో పెట్టడం జరిగింది. అయితే సూర్యగ్రహణం రోజు మట్టిలో పాతి పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుందనే నమ్మకాన్ని కొంతమంది చదువుకున్న విద్యార్థులు కొట్టివేసినప్పటికీ అక్కడున్న తల్లిదండ్రులూ, ఊరి పెద్దలు మాట వినకుండా చిన్నారులను అక్కడికి తీసుకువెళ్ళి పెట్టారు. కానీ చిన్నారులైతే భయబ్రాంతానికి గురికాగా, వారు పసితనంలో ఒక్క సారిగా ఊపిరి బిగపెట్టుకొని మట్టిలో కూర్చున్నప్పుడు వారి పరిస్థితి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది.