English | Telugu

నిమ్మగడ్డ పై వేటు దుర్మార్గం: దేవినేని ఉమ

రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సి ఇ సి ) రమేష్ కుమార్ పై వేటు నిర్ణయం చట్ట ప్రకారంగా చెల్లుబాటు కాదని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు అన్నారు. సీఎం జగన్ దుర్మార్గంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, కరోనా బారిన పడకుండా 5 కోట్ల ప్రజలను రమేష్ కుమార్ కాపాడారని దేవినేని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్ లు కోర్టులో నిలబడవని, మాస్క్ లు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారని దేవినేని ఉమా మహేశ్వర రావు దుయ్యబట్టారు. ఉద్యోగులపై జగన్ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగుతోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులపై.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్‌లు పెడుతున్నారని కూడా మాజీ మంత్రి ఆరోపించారు.