English | Telugu
స్పెషల్ కోర్టులో హాజీపూర్ కేసు....
Updated : Oct 24, 2019
మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. స్కూల్ కి వెళ్ళీ చదువుకోవల్సిన విద్యార్ధులను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన భువనగిరి జిల్లా హాజీపూర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వేళ్తే వరుస హత్యల కేసులో విచారణ ప్రారంభించింది భువనగిరి స్పెషల్ కోర్టు. ఈ నెల పద్నాలుగు నుంచి పధ్ధెనిమిది వరకు ట్రైల్ నడిచింది. చార్జ్ షీట్ కాపీలతో పాటు డిఎన్ఎ ఫోరెన్సిక్ రిపోర్ట్ లను కోర్టుకు సమర్పించారు పోలీసులు. చార్జిషీట్ లో మూడు వందల మంది సాక్షులున్నారు,సాక్షులు సహా బాధిత కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్ లను కోర్టు రికార్డ్ చేసింది. మరో నలభై ఐదు రోజుల పాటు విచారణ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
మూడు రేప్ మరియు మర్డర్ కేసులలో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కేసు హాజీపూర్ శ్రీనివాస్ రెడ్డి కేసు. దాదాపుగా ముగ్గురు విద్యార్థులను పదవ తరగతి విద్యార్ధితో పాటుగా ఏడవ తరగతి విద్యార్ధులు మొత్తం ముగ్గురు విద్యార్థులను కూడా అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు సంబంధించి చాలా పెద్ద సమస్య ఎదురయ్యింది. దీనికి సంబంధించి ఒక స్పెషల్ కోర్టు కూడా ఇప్పటికే సిద్దం అయ్యింది.
ఆ స్పెషల్ కోర్టుకు సంబంధించినటువంటి విచారణ ఈ నెల 14 వ తేదీన హజిపూర్ శ్రీనివాస్ రెడ్డి కేసు ట్రయల్ ప్రారంభమైంది. ఈ ట్రయల్ కు సంబంధించి ఇప్పటికే పోలీసులు దాఖలు చేసిన ఈ మూడు కేసుల చార్జిషీట్ లతో పాటుగా దాదాపు మూడు వందల మంది సాక్ష్యాలను ఈ మూడు కేసుల్లోని చార్జిషీట్ లో పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసును దాదాపుగా టెక్నికల్ సాక్ష్యాలతో పాటుగా అతను చేసినటువంటి హత్యాచారాలకు సంబంధించి ఫిజికల్ సాక్ష్యాలు కూడా పోలీసులు వివిధ రూపాల్లో రాబట్టారు.