English | Telugu

డాక్టర్ మీద ఉమ్మేసిన కరోనా పేషేంట్, హత్యాయత్నం కేసు నమోదు

తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స అందిస్తున్న వైద్యులపై దాడులు, వేధింపులు పెరుగుతున్నాయి. తాజాగా, తమిళనాడులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. తనకు చికిత్స అందిస్తున్న వైద్యుడిపైనే ఓ రోగి ఉమ్మివేశాడు.

కరోనా లక్షణాలతో 40 ఏళ్ల వ్యక్తి ఒకరు తిరుచ్చిరాపల్లి ఆసుపత్రిలో చేరాడు. అతడు చేరినప్పటి నుంచి చికిత్సకు సహకరించకపోగా, ముఖానికున్న మాస్కును తొలగించి వైద్యులపై విసురుతూ వేధించడం మొదలుపెట్టాడు. తాజాగా, తనకు చికిత్స అందిస్తున్న ఓ వైద్యుడిపై ఉమ్మి వేశాడు. వైద్యుల ఫిర్యాదు మేరకు అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.