English | Telugu
ఆమె ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవచ్చు, కానీ ఎందుకు చేయలేదో తెలుసా...
Updated : Apr 13, 2020
అంతే కాదు, ఆమె లైసెన్స్ లేకుండా కూడా కార్ డ్రైవ్ చేయవచ్చును. ఎందుకంటే, ఇప్పటికీ లైసెన్సులన్నీ బ్రిటన్ లో ఆ మహారాణి పేరు మీదే జారే అవుతాయి కాబట్టి. అందువల్ల, ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం పడదని విజ్ఞులు గుర్తించాలి. ఆమె విదేశీ ప్రయాణానికి పాస్ పోర్ట్ కూడా అక్కర్లేదు. ఇంతేకాదు, ఆమె ఏటా రెండు పుట్టినరోజులు జరుపుకుంటారు. బ్రిటన్ పట్టపు రాణి కి ఒక పుట్టినరోజు సరిపోదు కదా మరి. క్వీన్ ఎలిజిబెత్ అధికారిక జన్మదినాన్ని ఏటా జూన్ రెండో శనివారం ఒక పండుగ లా జరుపుకోవటం ఒక ఆనవాయితీ ల వస్తోంది. వాస్తవానికి ఆమె పుట్టినరోజు ఏప్రిల్ 21.
అంతేకాదు క్వీన్ కుటుంబం కోసమే అచ్చంగా బకింగ్ హాం ప్యాలెస్ లో ఒక ATM ఉంది. అయితే, అంత లావు పట్టపురాణి కి కూడా అప్పుడప్పుడూ ఆ హోదా బోర్ కొడుతూ ఉంటుందని లోక నానుడి. అందుకోసం ఆమెకు ప్రత్యేకంగా ఒక పర్సనల్ పోయెట్ కూడా ఉన్నారన్నమాట, ఆమెను తన కవితా మాధుర్యంలో ఓలలాడించటానికి .... ఇక రాచరిక వ్యవహారాల్లోకి వస్తే, బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించిన అన్గాన్ని చట్టాలు కూడా చుట్టాలు చుట్టుకుని రాణివాసం గుమ్మం తట్టాల్సిందే, ఆమె సంతకం పొందాలసిందే, ఆనక వాటిమీద రాచముద్ర....సారీ రాచముద్ర అనకూడదేమో, రాణిముద్ర పొందాల్సిందేనన్నమాట. నిజానికి, క్వీన్ ఎలిజిబెత్ ఆదాయపన్ను కట్టాల్సిన అవసరం లేనప్పటికీ, 1992 నుంచీ కూడా ఆమె పన్ను కడుతూనే ఉన్నారు.
ఇంతేకాదు..క్వీన్ ఎలిజిబెత్ II, ఆస్ట్రేలియా కు కూడా మహారాణే సుమండీ.. చెప్పొద్దూ...ఆమెకున్న ఇన్నిభోగాలు చూస్తుంటే, కన్ను కుడుతోంది కదా.. నిజానికి ఆస్ట్రేలియన్ ప్రభుత్వాన్ని తొలగించేంతటి విశేష అధికారాలు ఆమెకున్నాయి. ఇహ, క్వీన్ మరో కోణమేమిటంటే, ఆమె చర్చ్ అఫ్ ఇంగ్లాండ్ ధర్మాధికారి కూడా.. అంతేకాదు ఆమెను ఏ సందర్భంలోనూ ఎవరూ ప్రాసిక్యూట్ చేయలేరు, అరెస్ట్ చేయలేరు కూడా!
ఇంగ్లాండ్ దేశపు సాయుధ దళాలకు ఆమె కమాండర్ ఇన్ చీఫ్ కూడా..అంటే, సర్వ సైన్యాధ్యక్షురాలన్న మాట. ఆ దేశ క్యాబినెట్ లో మంత్రులను నియమించటంతో పాటు, తొలగించే అధికారం కూడా క్వీన్ కు ఉంటుంది. ఆమెకు తిక్కరేగితే, ప్రైమ్ మినిష్టర్ ను కూడా డిస్మిస్ చేయవచ్చు, అన్ని విశేషాధికారాలు ఆమెకు ఉన్నాయన్న మాట! ఏ దేశం మీదైనా అధికారికంగా వార్ డిక్లేర్ చేసే విశేష అధికారం ఉన్న ఏకైక వ్యవ్యక్తి-ఇంగ్లాండ్ లో కేవలం క్వీన్ మాత్రమే. స్పైడర్ మ్యాన్ అంకుల్ బెన్ చెప్పినట్టు -- " విశేషమైన అధికారాన్ని అంటిపెట్టుకుని విస్తృతమైన బాధ్యత కూడా ఉంటుందని మనం ఇక్కడ ఒకసారి గుర్తుచేసుకోవాలి." ఆ సూత్రం స్ఫూర్తి ఆమెకు తెలుసు కాబట్టి, ఆమె తన విశేషాధికారాల మీద స్వీయ నియంత్రణ పాటిస్తూ వస్తున్నారు. అందులో యావత్ ప్రపంచం ఆమెను ఇంకా గౌరవిస్తూనే ఉంది..