English | Telugu

గోదావరి జిల్లాలో కరోనా కలకలం!

ముందు జాగ్రత్తగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్పిటల్ లో ఐసోలేషన్ సెంటర్లు
వెంటి లెటర్లు తో ప్రత్యేక వార్డ్ లు
తాజా ప‌రిస్థితుల‌పై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స‌మీక్ష‌

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపింది. ఇటీవల దక్షిణ కొరియా వెళ్లి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి కరోనా సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కరోనా వైరస్ సోకినట్లుగా అనుమానిస్తున్న ఈ వ్యక్తి ఇటీవల ఓ పెళ్ళికి కూడా హాజరైనట్లు తెలుస్తోంది. కొత్తపేట మండలం వాడపాలేనిలోకి చెందిన సదరు వ్యక్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్నాడు.

ఎపి లో క‌రోనా వైర‌స్ ఆన‌వాళ్ల‌పై అప్రమత్తమైన AP వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, బాధిత వ్య‌క్తి ఆరోగ్య‌ప‌రిస్థితి, చేప‌డుతున్న చికిత్స‌పై వైద్య అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.

కొత్త పేట మండలం వాడపల్లి గ్రామానికి చెందిన బండారు వెంకటేస్వర్లు ఆరోగ్య ప‌రిస్థితిపై నిల‌క‌డ‌గా వుంద‌ని, వైద్య పరీక్షలకు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐస్లేషాన్ వార్డ్ లో వెంకటేస్వర్లు కు వైద్య పరీక్షలు నిర్వ‌హించిన‌ట్లు అధికారులు మంత్రికి తెలిపారు.

కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తాజా ప‌రిస్థితిపై స‌మీక్షించారు.

కోన సీమ ప్రాంతంలో ప్రజలు ఆందోళన చెందవ‌ల్సిన అవ‌స‌రం లేద‌ని ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టిందని మంత్రి భ‌రోసా ఇచ్చారు. ముందు జాగ్రత్తగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్పిటల్ లో ఐసోలేషన్ సెంటర్లు సిద్ధం చేస్తున్నారు. వెంటి లెటర్లు తో ప్రత్యేక వార్డ్ ల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న రెడీ చేశారు.
సెక్రటేరియట్ లో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. 0866-2410978నెంబర్ కు ఫోన్ చేయవచ్చు.