English | Telugu
తెలంగాణలో 39 కేసులు...
Updated : Mar 25, 2020
మంగళవారం బయటపడిన 6 కేసుల్లో ముగ్గురు ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కాగా..మిగతా ముగ్గురు స్థానికులున్నట్లు తెలుస్తోంది. బాధితులతో కలిసిమెలిసి ఉన్న వారి కుటుంబసభ్యులను స్వీయ నిర్భందనంలో పరిశీనలో ఉంచినట్లు వైద్య అధికారులు వెల్లడించారు.
కరోనా బాధితులను గుర్తించడానికి ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. దాదాపు 30 వేల మంది వైద్య, అంగన్ వాడి సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు.
ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రానికి 19 వేల 313 మంది అంతర్జాతీయ ప్రయాణీకులు వచ్చారు. వీరందరూ స్వీయ నిర్భందనలో ఉంటే వైరస్ కట్టడి అవుతుందని భావిస్తూ..అన్నీ శాఖలను అలర్ట్ చేసింది ప్రభుత్వం. వచ్చే పది రోజులు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణీకుల ఆరోగ్య పరీశీలనే లక్ష్యంగా ముందుకెళుతామని వైద్య శాఖ వెల్లడిస్తోంది.