English | Telugu

విదేశాల నుంచి వచ్చిన‌ మనోళ్లే శాడిస్టుల్లా!

మ‌రీ దారుణం. ఇంత దరిద్రంగా.. హీనంగా వ్యవహరిస్తారా? అన్న సందేహంతో పాటు.. వారి వ్య‌వ‌హార‌శైలి క‌రోనా వైర‌స్‌లా వుంది.
విదేశాల నుంచి వచ్చినోళ్లు మరీ ఇంత భాద్యత లేకుండా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లే క‌రోనా దెబ్బ‌కు దేశంలోని ప్ర‌జ‌లు క‌రోనా బారిన ప‌డుతూ ఒకొక్క‌రూ రాలిపోతున్నారు.

విదేశాలకు వెళ్లిన వారిలో అత్యధికులు బాగా చదువుకొని చక్కటి ఉద్యోగం చేసుకుంటూ, సంపద విషయంలోనే కాదు.. అలవాట్లు.. ఆలోచనలు సైతం అంతో ఇంతో బాగుంటాయన్న భావన మొన్నటి వరకూ ఉండేది. కానీ.. ఎప్పుడైతే వ‌చ్చిన వాళ్ళు ఇంటి ప‌ట్టున వుండ‌క తెగింపుతో ప్ర‌జ‌ల‌తో క‌లవాల‌నుకోవ‌డం వీరి పాడు బుద్ధిని బ‌య‌ట‌పెడుతోంది. వీళ్ల లేకీత‌నానికి ఇంకెంత మంది బ‌లికావ‌ల్సి వుందో.

ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రానికి 19 వేల 313 మంది అంతర్జాతీయ ప్రయాణీకులు వ‌చ్చారు. వీరిలో చాలామంది స్వీయ నిర్భందనం పాటించ‌డం లేదు. ఎంత అప్రమత్తంగా ఉండాలో అలా వుండ‌టం లేదు. అవగాహన కల్పించేలా ఉండాలే తప్పించి.. బాధ్యత లేకుండా బలాదూర్ తిరుగుతున్న వారి తీరు చూస్తే.. అనవసరంగా విదేశాల నుంచి వారు వ‌చ్చేలా ప్ర‌భుత్వం ఎందుకు స‌హ‌క‌రించింద‌ని పిస్తోంది.
విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ విధిస్తే.. వాటిని వదిలేసి.. ఎక్కడికి పడితే అక్కడకు తిరుగుతున్నారు. పార్టీలు చేసుకుంటున్నారు. చుట్టాల‌తో క‌లుస్తున్నారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పిన‌ట్లు ఇలా రోడ్ల‌పై కనిపించిన ఇటీవ‌ల విదేశాల నుంచి వ‌చ్చిన వ్య‌క్తుల పాస్‌పోర్టుల శాశ్వ‌తంగా ర‌ద్దు చేసి ఈ విష‌యాన్ని టీవీలో విస్తృతంగా ప్ర‌చారం చేయ‌గ‌లిగితే అలాంటి మూర్ఖుల్లో కొంతైనా మార్పు రావ‌చ్చు.
అనవసరంగా దేశంలోకి రానిచ్చి భారీ మూల్యం చెల్లించుకుంటోంది దేశం ఇప్పుడు.

ఇంత కాలం విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో అటు ప్రభుత్వం.. ఇటు ప్రజలు ఓపికతో సహించారు. చుట్టుప‌క్క‌ల వున్న ప్ర‌జ‌ల‌కు ఈ విష‌యం తెలుస్తుంది కాబ‌ట్టి ప్ర‌జ‌లే అప్ర‌మ‌త్తంగా వుండి అలాంటి వారి వివ‌రాలు వెంట‌నే పోలీసుల‌కు అందించాలి. లేక పోతే మీ జీవితాలు ఆరిపోతాయ‌న్న అంశాన్ని గుర్తించుకోవాలి.

అలాగే విదేశాల‌నుంచి వ‌చ్చిన వారి బంధుమిత్రులు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్ళిపోవాలి. వారి స‌మాచారం స్థానిక పోలీసులకు ఇవ్వటం చాలా అవసరం. విదేశాల నుంచి వచ్చినోళ్లు బాధ్యత లేకుండా వ్యవహరించటం కారణంగా.. ఇక్కడి ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశాన్ని ఇవ్వకూడదన్నది మర్చిపోకూడదు.

కరోనా మహమ్మారి బారి ప‌డి ఇంత మంది బాధ‌ప‌డుతున్నారంటే దానికి ప్ర‌ధాన‌ కారణం.. విదేశాల నుంచి వచ్చినోళ్ల పుణ్యమేనన్నది మర్చిపోకూడదు. తాము ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాం అన్న విష‌యాన్ని మ‌రిచి నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ త‌మ కుటుంబ‌స‌భ్యుల జీవితాల‌తో పాటు చుట్టుప‌క్క‌ల వారి ప్రాణాల‌తో చెల‌గాటమ‌డాడం ఎంత వ‌ర‌కు న్యాయ‌మో ఒక సారి ఆలోచించుకోవాలి.

విదేశాల నుంచి వచ్చిన స్వదేశీయులు.. బుద్ధిగా ఎవరిళ్లల్లో వారిని సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోకుండా ఆ విషయాన్ని పట్టించుకోకుండా వుండ‌టం నీచాతి నీచమే, వ‌ళ్లు కొవ్వు ఎక్కితే ఇలాగే వుంటుంది. శాడిజ‌మే అంటే ఇదే మ‌రి.