English | Telugu

ఇంట్లో ఉంటే జనాభా లెక్కల లో ఉంటారు, బయట పోతే కరోనా లెక్కలలో పోతారు!

నిర్లక్ష్యం.. ఇవి కేవ‌లం మూడు అక్షరాలైన దానీ అర్ధాన్నీ మాటల్లో వివరించలేము.. ఒకరి నిర్లక్ష్యం వలన ఈ రోజు ఈ ప్రపంచమే అల్లకల్లోలం అవుతుంది..

ఒకరి నిర్లక్ష్యం వలన పేదవాళ్ళు ఆకలి చావులు చస్తున్నారు.. ఒకరి నిర్లక్ష్యం వలన మధ్యతరగతి జీవితాలు సంపాదన లేక దిక్కు తోచని స్థితిలో బ్రతుకుతున్నారు..

ఒకరి నిర్లక్ష్యం వలన రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ఆ ఒకరి నిర్లక్ష్యం వలన నిండు ప్రాణాలు బలి అవుతున్నాయి..

చైనా నుండి ఇండియా 1800 వంద‌ల‌ మైళ్ల దూరంలో ఉంది.. ఎక్కడో చైనా లో పుట్టిన వైరస్ 1800 వంద‌ల మైళ్ల‌ దూరంలో ఉన్న ఇండియాకి వచ్చి ఇక్కడ ఉన్న జనాలను ఇబ్బంది పెడుతుంది..మరి చైనా పక్కనే దానీ దేశ సరిహద్దును అనుకోని ఉన్న వియత్నాం 1500 వంద‌ల మైళ్ల దూరంలో ఉంది.. కానీ అక్కడ కరోన వైరస్ కంట్రోల్ లో ఉంది.

అయితే ఇంత దూరంలో ఉన్న ఇండియాలో మాత్రం చేయి దాటి పోతుంది. ఎందుకంటే దానికి కారణం మన నిర్లక్ష్యమే.

చైనా నుండి 4700 వంద‌ల మైళ్ల‌ దూరంలో ఉన్న ఇటలీలో ఆ దేశ ప్రజల నిర్లక్ష్యం వలన ఈ రోజు ఇటలీ పరిస్థితి ఎలా విషమంగా తయారైందో మనంద‌రం చూస్తూనే వున్నాం. అయినా మ‌నకు భ‌యం లేదు.

మన జాగ్రత్తలే మన జీవితాన్ని కాపాడుతాయి.. నీ కోసం కాక పోయిన నిన్ను కన్న తల్లిదండ్రుల కోసం, నువ్వు కన్న నీ పిల్లల కోసం... నీ ఆరోగ్యాన్ని కాపాడుకో... ఇంట్లోనే వుండు. జ‌నాభా లెక్క‌ల్లో వుంటావు.