English | Telugu

అక్ర‌మ‌సంబంధాల గుట్టు విప్పుతున్న క‌రోనా!

క‌రోనా ఎవ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. గుట్టుగా సాగుతున్న అక్ర‌మ‌సంబంధాల్ని సైతం ర‌ట్టు చేస్తోంది. క‌థ‌లు క‌థ‌లుగా బుద్ధిమంతుల బంఢారం బ‌య‌ట‌ప‌డుతోంది. క‌రోనా పాజిటివ్‌గా వ‌స్తే పేషంట్‌తో పాటు అత‌ని ప్రైమ‌రీ, సెంకండ‌రీ కాంట్రాక్ట్‌లపై పోలీసులు జ‌ల్లెడ ప‌డుతున్నారు. సెల్‌ఫోన్ లిస్ట్ ఆధారంగా విచార‌ణ చేస్తున్నారు. పోలీసు ఎంక్వైరీల్లో షాకింగ్ విష‌యాలు వెలుగుచూస్తున్నాయి. బుద్ధిమంతుల ముసుగు వారు చేసిన త‌ప్పుడు ప‌నుల‌న్నీ బ‌య‌ట ప‌డుతున్నాయి.

బోపాల్‌లో ఓ అమ్మాయికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అయితే ఆ అమ్మాయికి బాయ్ ఫ్రండ్ వున్నాడ‌నే విష‌యం ఎవ‌రికీ, ఇంట్లోవాళ్ళ‌కు కూడా తెలియ‌దు. అయితే పోలీసులు ఆ అమ్మాయి ఫోన్‌పై నిఘా పెట్టారు. ఎవ‌రెవ‌రితో కాంట్రాక్ట్‌లో వుంటుందో లిస్ట్ తీశారు. అలా బాయ్ ఫ్రెండ్ బ‌య‌ట‌ప‌డ్డాడు. వెంట‌నే అత‌న్ని టెస్ట్ చేస్తే అత‌నికి పాజిటివ్ తేలింది.

దీంతో షాక్‌కు గురైన పోలీసులు అత‌డు ఇంకెవ‌రితోనైనా కాంట్రెక్ట్‌లో వున్నాడా? ఫోన్‌లో ఈ మ‌ధ్య కాలంలో ఎవ‌రితో మాట్లాడాడు లిస్ట్ తీశారు. అంతే ఇక్క‌డా కూడా పోలీసుల మైండ్ బ్లాంక్ అయింది. ఈ అబ్బాయికి మ‌రో గ‌ర్ల ఫ్రెండ్ వుంది. త‌ర‌చూ ఆమెను క‌లుస్తూ వుండే వాడని చెప్పాడు. దీంతో పోలీసులు ఆ అమ్మాయికి టెస్ట్ చేశారు. ఆమెకు కూడా పాజిటివ్ వ‌చ్చింది.
ఈ చైనా ఇంత‌టితో ఆగ‌లేదు. ఊహించ‌ని రీతిలో మొద‌టి అమ్మాయి ద్వారా ఇంకో అబ్బాయికి క‌రోనా సోకింది. దీంతో ఆమె ఇద్ద‌రు అబ్బాయిల‌తో ల‌వ్ ఎఫైర్ న‌డిపింద‌ని బ‌య‌ట ప‌డింది.

ఇదే ప్రాంతంలో ఇలాంటిదే మ‌రో విచిత్ర‌మైన కేసును పోలీసులు ఛేదించారు. లాక్‌డౌన్ వున్నా ప్ర‌తి రోజూ ఆఫీసుకు వెళ్ళే వ్య‌క్తికి క‌రోనా సోకింది. అయితే ఇంటి చుట్టుప‌క్క‌లా కానీ, అత‌ని ఫ్రెండ్స్‌కు కానీ, ఆఫీసులో కానీ ఎవ‌రికైనా క‌రోనా వుందా అని ఆరా తీస్తే అలాంటిదేమీ లేదు. అయితే ఈ వ్య‌క్తి ఆఫీసు ముగిసిన త‌రువాత త‌న సెకెండ్ సెట‌ప్ ద‌గ్గ‌ర‌కు వెళ్తున్న‌ట్లు పోలీసులు ఫోన్ లిస్ట్ ద్వారా గుర్తించారు.

ఆమెకు టెస్ట్ చేస్తే క‌రోనా పాజిటివ్ వుంది. ఇద్ద‌రికీ పాజిటివ్ తేల‌డంతో ఇద్ద‌ర్నీ ఐసొలేష‌న్ వార్డుకు త‌ర‌లించారు. అయితే ఈమె ద్వారా ఇంకెవ‌రికైనా వ‌చ్చిందా అని పోలీసులు ఆమె పోన్ లిస్ట్‌పై దృష్టి పెట్టి విచార‌ణ చేప‌ట్టారు.

గుట్టు చ‌ప్పుడు కాకుండా జ‌రిగిన వ్య‌వ‌హారాల‌న్నీ క‌రోనా పుణ్య‌మా అని వెలుగులోకి వ‌స్తున్నాయి. కరోనా క‌ట్ట‌డికి అధికారులు తీస్తున్న కాంట్రెక్ట్ లిస్ట్‌ల‌తో కొత్త విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. బుద్ధిమంతులా న‌టించే వారి బండారాన్ని బ‌ద్ధ‌లై కొత్త చిక్కులు వ‌చ్చి ప‌డుతున్నాయి.