తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19తో నేడు ఒకరు మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 644కు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖహెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. ఇప్పటి వరకు ఆస్పత్రి నుంచి 110 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, కోవిడ్-19తో 18 మంది మృతి చెందారు. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆస్పత్రుల్లో 516 మంది చికిత్స పొందుతున్నారు.