English | Telugu

భ‌య‌పెడుతున్న లెక్క‌లు! పరిస్థితి అదుపులోకి రావ‌డంలేదు!

దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది. లాక్ డౌన్ ప్రారంభం అయిన తొలి రోజున 526 గా ఉన్న కరోనా పాజిటివ్ కేసులు, ఏప్రిల్ 14 నాటికి 11 వేలకు చేరువ అయ్యాయి. కేంద్ర హోంశాఖ అధికారుల కథనం ప్రకారం దేశ వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కరోనా బాధితులు క్వారెంటైన్‌ కేంద్రాల్లో ఉన్నట్లు సమాచారం. అయితే కరోనా వ్యాప్తి కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా 3 లక్షల 23 వేల మందిని నిర్బంధ కేంద్రాల్లో (క్వారెంటెన్ లో) ఉంచినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.

అత్యధికంగా మహారాష్ట్రలో 66వేల మంది, ఉత్తరాఖండ్‌లో 55వేలు, రాజస్తాన్‌ 35,841, ఉత్తరప్రదేశ్‌ 31,158, గుజరాత్‌ 14,204, బిహార్‌లో 11,998 మందిని హోం క్వారెంటైన్‌లో ఉన్నారు. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలోనే కరోనా బాధితులు క్వారెంటైన్‌లో ఉన్నారు. దేశంలోని మొత్తం 718 జిల్లాల్లో దాదాపు 370 జిల్లాకు పైగా కరోనా బారిన పడ్డయని హోంశాఖ నివేదికలో తేలింది.

కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశంలో సుమారు 11 వేలకు చేరుకున్నాయి పాజిటివ్‌ కేసులు. మృతుల సంఖ్య 339కి చేరింది. పరిస్థితి అదుపులోకి రాలేదు.