English | Telugu

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కు కరోనా

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఓ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇలా పలువురు కరోనా బారిన పడగా.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కరోనా బారిన పడ్డారు. అస్వస్థతకు గురైన ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో వీహెచ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.