English | Telugu

రాజధాని రైతుల పిటిషన్ పై హైకోర్టు కీలక ఉత్తర్వులు

చంద్రబాబు హయాంలో అప్పటి ఏపీ ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని నిర్ణయించి వేలాది మంది రైతులతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం రాజధానికి భూమి ఇచ్చిన వారికి ప్రభుత్వం ఏటా కౌలు ఇస్తూ వస్తోంది. ఐతే గత ఏడాది జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని మూడు భాగాలు చేసి కర్నూల్, వైజాగ్, అమరావతిలలో వరుసగా జ్యుడిషయల్ కేపిటల్, అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్, లెజిస్లేటివ్ కేపిటల్ గా మార్పు చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో తాజాగా అమరావతి ప్రాంత రైతులకు ఇవ్వవలసిన కౌలు ఇంతవరకు చెల్లించక పోవడం తో ఆ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు వార్షిక కౌలు చెల్లించేలా సీఆర్డీఏను ఆదేశించాలని వారు పిటిషన్ దాఖలు చేసారు. దీంతో వార్షిక కౌలు విషయంలో ఏపీ హైకోర్టు సీఆర్డీఏ కు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ చేసిన ధర్మాసనం కౌలుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై జూన్ 23వ తేదీలోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఆర్డీఏ కమిషనర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.