English | Telugu
నిర్లక్ష్యమే గ్యాస్ లీక్ కు కారణమా?
Updated : May 7, 2020
పరిశ్రమ ట్యాంకుల్లో దాదాపు 2 వేల మెట్రిక్ టన్నుల స్టైరెన్‌ను నిల్వ చేసింది. అక్కడ 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉంచడంలో ఫ్యాక్టరీ యాజమాన్యం విఫలమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో.. స్టైరెన్ లీక్ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలకు స్టైరెన్ గ్యాస్ వేగంగా వ్యాప్తి చెందింది. కాగా, గురువారం తెల్లవారుజామన చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందగా, దాదాపు 200 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మరో 2 వేల మంది అనారోగ్యానికి గురి అయ్యారు.