English | Telugu

రాజీనామాకు సిద్దం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌రెడ్డి అబద్దాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతు కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచాక నియోజకవర్గంలో రూ.4 వేల కోట్ల అభివృద్ధి జరిగిందని సీఎం చెప్తున్నాడు. నిజంగా నాలుగు వేల కోట్ల అభివృద్ధి జరిగినట్లు నిరూపిస్తే ఆ క్షణమే నేను సనత్‌నగర్ ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తాని తలసాని సవాల్ విసిరారు.

సీఎం రేవంత్‌రెడ్డి భాష మార్చుకోవాలని ఆయనకు ధైర్యం ఉంటే ఒపీనియన్ పోల్‌కు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. 23 నెలల్లో రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఎక్కడ తిరిగారో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 44 వేల కోట్లు హైదరాబాద్ నగరంలో ఖర్చు పెట్టామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కేవలం రూ. 4,600 కోట్లు మాత్రమే ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పెట్టిందని అన్నారు.

హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇళ్లు అయినా కట్టారా..? అని ప్రశ్నించారు. కేటీఆర్ హైదరాబాద్ తిరగలేదని అంటున్నారు.. ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో ఉన్నారా..? లేక వేరే దేశంలో ఉన్నారా..? అని తలసాని ప్రశ్నించారు.ఎన్టీఆర్‌కు మాగంటి గోపీనాథ్ వీరాభిమాని అని, ఎన్టీఆర్‌తో కలిసి మాగంటి గోపీనాథ్ తిరిగారని తలసాని అన్నారు.