English | Telugu
నెలకు రూ.3.82లక్షలు-అలవెన్సులు అదనం... ఐఏఎస్ లను మించి దేవులపల్లి అమర్ కు జీతం
Updated : Sep 27, 2019
ఆంధ్రప్రదేశ్ లో ఎంతోమంది ప్రతిభావంతులు, అర్హులు ఉండగా, తెలంగాణ జర్నలిస్టులకు ఏపీలో ఉన్నత పదవులు కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ...వాళ్లనుకూల వ్యక్తులకు పెద్దపీట వేయడం సహజం... కానీ ఆంధ్రప్రదేశ్ లో అసలు జర్నలిస్టు దిగ్గజాలే లేనట్లుగా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జర్నలిస్టులకు ఏపీలో పదవులు కట్టబెట్టుతున్నారు. అక్కడ స్వరాష్ట్రంలోనూ, ఇక్కడ ఏపీలోనూ తెలంగాణ జర్నలిస్టులకు పెద్దపీట దక్కుతుండగా, రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు మాత్రం తీవ్ర అన్యాయమే జరుగుతోంది.
ఇక, తెలంగాణ జర్నలిస్టు, సాక్షి టీవీలో డిబేట్ యాంకర్ గా పనిచేసిన దేవులపల్లి అమర్ ను ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా మరియు ఇంటర్ స్టేట్ ఎఫైర్స్ సలహాదారుగా నియమించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం... అతనికి సీనియర్ ఐఏఎస్ లను మించి జీతం, సదుపాయాలు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దేవులపల్లి అమర్ కు నెలకు అక్షరాలా 3లక్షల 82వేల రూపాయల జీతం చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో నేరుగా 2లక్షలు జీతం కాగా, వ్యక్తిగత సహాయకులు అంటే ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, ఆఫీస్ బాయ్, కారు డ్రైవర్లకు నెలకు 70వేలు చెల్లించనున్నారు. ఇక ఫోన్ బిల్లు 2వేలు, ఇంటి అద్దె 50వేలు ఇవ్వనున్నారు. ఇవికాకుండా మెడికల్ రీఎంబర్స్ మెంట్, సెకండ్ క్లాస్ ట్రైన్ ఛార్జీలు, ఎకానమీ ఫ్లైట్, అలాగే బిజినెస్ క్లాస్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఛార్జీలు అదనంగా చెల్లించనున్నారు.
ఏదిఏమైనా తెలంగాణ జర్నలిస్టులకు జగన్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరవడమే కాకుండా, పెద్ద మొత్తంలో ఆంధ్రా ప్రజల డబ్బును జీతాలుగా చెల్లించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. జగన్ ప్రభుత్వంపై ఇప్పటికే ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. ముఖ్యంగా సాక్షిలో పనిచేసిన తెలంగాణ జర్నలిస్టులను తీసుకొచ్చి... ఏపీలో ప్రభుత్వ పదవులు కట్టబెట్టడమేమిటని మండిపడుతున్నారు.