English | Telugu

క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన భారత్ బయోటెక్

375మందిపై మొదటి దశ ప్రయోగం

కోవిద్ 19 వైరస్ వ్యాక్సిన్ పై మన దేశంలో జరుగుతున్న పరిశోధనలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 15న మొదటిదశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించామని భారత్ బయోటెక్ వెల్లడించింది.

కోవాగ్జిన్ పేరుతో మార్కెట్ లోకి తీసుకురానున్న ఈ వ్యాక్సిన్ను దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ ను అనుమతి గతంలోనే వచ్చింది. మొదటిదశలో 375మందిపై ఈ వ్యాక్సిన్ ప్రయోగించామని ట్విట్టర్ లో వెల్లడించింది. దేశంలోని 12 వైద్యసంస్థల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.