English | Telugu

మాస్క్ పెట్టుకుంటారా ఫైన్ కడతారా.. బ్రెజిల్ అధ్యక్షుడికి జడ్జ్ వార్నింగ్ 

ప్రపంచం మొత్తం మీద కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. నిన్నటివరకు రోజువారీ నమోదవుతున్న కేసుల విషయంలో ముందున్న అమెరికాను కూడా క్రాస్ చేసి బ్రెజిల్ మొదటి స్థానానికి చేరుకుంది. కొద్ది నెలల క్రితం అసలు కరోనా కేసులే లేని బ్రెజిల్ లో నిన్నఒక రోజే 40,131 పాజిటివ్ కేసులు, 1364 మరణాలు నమోదయ్యాయి. దాదాపు 22 కోట్ల జనాభా కలిగిన బ్రెజిల్ ప్రస్తుత దుస్థితికి ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కారణమని విమర్శలు వస్తున్నాయి. కరోనా అంటే అసలు లెక్క లేనట్లుగా బోల్సోనారో ప్రవర్తిస్తున్నాడని, తాను స్వయంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడమే కాకండా ఇటు ప్రజలకు జాగ్రత్తలు చెప్పే పరిస్థితి అసలు లేదు.

ఒక పక్క కరోనా తీవ్రంగా ఉండగా అధ్యక్షుడు బోల్సోనారో ప్రజల్లోకి వెళ్లి ర్యాలీలతో పాల్గొంటున్నాడు. దీంతో కరోనా మరింత వ్యాపిస్తోంది. ఒక దేశానికీ అధ్యక్షుడై ఉండి ఆయనే స్వయంగా మాస్క్ పెట్టుకోకపోతే మేమెందుకు పెట్టుకోవాలి అని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. దీంతో బోల్సోనారో మాస్క్ పెట్టుకోవాల్సిందేనని బ్రెజిల్ ఫెడరల్ జడ్జి రెనాటో బోరెల్లీ ఆర్డర్ వేశారు. ఒకవేళ తన ఆదేశాన్ని పాటించకపోతే మాత్రం రోజుకు 29వేల రూపాయల ఫైన్ వేస్తానని స్పష్టం చేసారు.

ఇటు అమెరికా ప్రెసిండెంట్ ట్రాంప్ అటు బ్రెజిల్ ప్రెసిండెంట్ బోల్సోనారో ఇద్దరు కూడా త్వరలో వ్యాక్సిన్ వచ్చేస్తుందని దాంతో కరోనా మాయం అవుతుందని చెప్పి ప్రజలను బలి చేస్తున్నారు.