English | Telugu
రామ్ దేవ్ బాబా కరోనా ముందుకు బ్రేకులు..మమ్మల్ని అవమానించడం సరికాదు
Updated : Jun 24, 2020
ఆయుష్ మంత్రిత్వశాఖ ఆదేశాలపై యోగా గురువు రామ్ దేవ్ బాబా స్పందించారు. కరోనాకు మందు తయారుచేసే ముందు అన్ని అనుమతులు తీసుకున్నామని స్పష్టంచేశారు. మెడిసిన్‌కు సంబంధించి అన్ని వివరాలు ఇప్పటికే ఆయుష్ మంత్రిత్వశాఖకు అందజేశామని.. అవి త్వరలోనే వారికి చేరుకుంటాయని తెలిపారు. తాము చట్టాన్ని ఎక్కడా అతిక్రమించలేదని స్పష్టంచేశారు. కరోనిల్, శ్వాసరి మందులు కరోనా రోగులపై వందశాతం పనిచేశాయని పేర్కొన్నారు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి, 100 శాతం రోగులు కోలుకున్నాకే ప్రజలు చెబుతున్నామని తెలిపారు. పతంజలి చేసిన పరిశోధన, మందు కనుగొనడంతో ప్రభుత్వం తమను అభినందించాల్సింది పోయి.. అవమానించడం సరికాదన్నారు. దీనిపై ఇప్పటికే ఆయుష్ అధికారులతో మాట్లాడామని.. మెడిసిన్ కు సంబంధించి సమాచారం లేదని చెప్పడంతో, పరిశోధనలకు సంబంధించిన వివరాలను పంపించామని రామ్ దేవ్ పేర్కొన్నారు.