English | Telugu
జార్ఖండ్ ఎన్నికల ఫలితాల పై హర్షం వ్యక్తం చేస్తున్న జగన్.....
Updated : Dec 24, 2019
జార్ఖండ్ లో జేఎంఎం కాంగ్రెస్ కూటమి సర్కార్ కొలువుదీరబోతోంది. 43 స్థానాల్లో కూటమికీ ఆధిక్యం లభించగా బీజేపీ 28 స్థానాల్లో మాత్రమే లీడ్ లో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి చేయబోతున్నారు జేఎంఎం వర్కింగ్ ప్రసిడెంట్ హేమంత్ సోరెన్. బర్హెడ్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఘన విజయాన్ని సాధించారు. దుంకాలలో కూడా ఆధిక్యంలోనే ఉన్నారు హేమంత్. తన తండ్రి శిబూ సొరేన్ కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు శిబూసోరెన్ కు చాలా ఊరటనిచ్చాయి. ఆయన ఒక విధంగా బీజేపీ పై ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలియజేశారు. తనయుడు హేమంత్ సీఎం కాబోతున్నాడనే ఆనందం ఆయన ముఖంలో కన్పిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు పై హేమంత్ కు కీలక సూచనలు చేశారు శిబుసోరెన్. ఎన్నికల ఫలితాల పై చాలా రిలాక్స్ గా ఉన్నారు హేమంత్ సోరెన్. తన నివాసంలో సైకిల్ తొక్కుతూ రిలాక్స్ అయ్యారు.
తన కుమారుడితో కలిసి సైకిల్ తొక్కారు హేమంత్ సోరెన్. పార్టీని విజయం వైపు నడిపించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. జార్ఖండ్ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఇప్పటికీ నెరవేరిందన్నారు హేమంత్ సోరెన్. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని తెలిపారు. జార్ఖండ్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని ఎన్నికల ఫలితాలతో జేఎంఎం కార్యకర్తల్లో జోష్ వచ్చిందని ఆయన తెలియజేశారు.బ్రాంచితో సహా పలుచోట్ల సంబరాలు చేసుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు, బాణసంచా పేల్చి వేడకలు చేసుకున్నారు. ఓటమిని అంగీకరించినట్లుగా ప్రకటించారు జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్. 5 ఏళ్ళలో జార్ఖండ్ అభివృద్ధికి తాము కృషి చేసినట్లుగా ప్రజా తీర్పును శిరసావహిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి గుణపాఠం నేర్పనున్నారు కాంగ్రెస్ నేతలు. ఢిల్లీ ఎన్నికలతో పాటు వచ్చే అన్ని ఎన్నికల్లో కూడా బీజేపీ ఓటమి ఖాయమన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్. గత ఆరేళ్లుగా మోదీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు అర్థమయ్యేలాగా చేయగలిగామన్నారు. మొత్తం మీద జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు కాంగ్రస్ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.