English | Telugu
ఉక్కు కార్మాగారంతో రాయలసీమకు మంచి రోజులు రాబోతున్నాయన్న జగన్.........
Updated : Dec 24, 2019
3 ఏళ్ల లోనే కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలియజేశారు. చంద్రబాబు మాదిరిగా తాను ఎన్నికలకు 6 నెలల ముందు టెంకాయ కొట్టలేదని అధికారం లోకి వచ్చాక 6 నెలలకే టెంకాయ కొట్టానని గుర్తు చేశారు. వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ రావడం వల్ల ఈ ప్రాంత పరిస్థితి మారుతుందని ఆయన తెలియజేశారు.6 నెలల ముందు ఒక పెద్దమనిషి వచ్చి టెంకాయ కొట్టాడని ఆయన తెలియజేశారు. ఉన్న 5 సంవత్సరాలు పరిపాలన చేయడానికే ప్రజలు అధికారాన్ని ఇచ్చారు అని,ఇలాంటి పరిస్థితుల్లో నాలుగున్నర సంవత్సరం ఏమీ చేయకుండా కేవలం ఎన్నికలకు 6 నెలలు ముందు మాత్రం వచ్చి టెంకాయ కొడితే దానిని మోసం అంటారు అని జగన్ తెలియజేశారు.కానీ అధికారం లోకి వచ్చిన 6 నెలలకే టెంకాయ కొడితే దానిని చిత్తశుద్ధి అని కూడా అంటారు అని ఆయన స్పష్టం చేశారు.వెనకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం, ఈ ప్రాంతానికి మంచి జరగాలి అంటే నీళ్ళు కావాలి, పరిశ్రమలు కావాలి, ఊద్యోగాలు రావాలి ఇవి ఎంత అవసరమో తెలిసిన వ్యక్తిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నానని జగన్ వ్యాఖ్యానించారు.
అందులో భాగంగానే ఈ రోజు కడపలోనే రాయలసీమ ఆర్థిక చరిత్రను, ఉద్యోగాల చరిత్రను మార్చడం కోసం 30 లక్షల టన్నుల ఉక్కు కార్మాగారానికి ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నట్లు సగర్వంగా వేదిక పై తెలియజేశారు.ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుతో రాయలసీమలో 25,000 ల మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందన్నారు. జిల్లాల ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్ తో సీమలో ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మన బ్రతుకులు మారుతాయని, పారిశ్రామిక రంగంలో రాయలసీమ ప్రాంతమంతా కూడా పరుగెడుతుందని ఆశాభావంతో తాను ఈ ఉక్కు ఫ్యాక్టరీకి పునాది రాయి వేయనున్నట్లు జగన్ తెలియజేశారు.