ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మళ్లీ షాక్ ఇచ్చింది. వరుసగా మూడో నెల కూడా ఉద్యోగుల జీతాల్లో కోతను విధించింది. లాక్‌డౌన్‌తో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇళ్లకే పరిమితం కావడంతో.. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగుల జీతాలు కోతపెట్టారు. అయితే, ఇప్పుడు లాక్‌డౌన్ సడలింపులతో మళ్లీ సాధారణ పరిస్థితులు రావడంతో.. మే నెలలోనైనా పూర్తి జీతం వస్తుందని ఉద్యోగులు భావించారు. కానీ, ఈ నెల కూడా ఉద్యోగులకు సగం జీతం మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే నెల కూడా ఉద్యోగులకు సగం జీతం ఇవ్వాలని.. ఆర్థిక శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.