English | Telugu
ఈనెల 7 నుంచి కోవాక్జిన్ రెండోదశ క్లినికల్ ట్రయల్స్
Updated : Sep 5, 2020
ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు బలితీసుకుంటున్న కోవిడ్ 19 వైరస్ ను ఎదుర్కోనేందుకు మన దేశంలో తయారవుతున్న కోవాక్జిన్ రెండోదశ క్లినికల్ ట్రయల్స్ ఈనెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి అయినట్లు ప్రకటించారు. కోవాక్జిన్ వ్యాక్సిన్ ను పూనే లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ తయారుచేస్తోంది.
ఈ వ్యాక్సిన్ రెండోదశ క్లినికల్ ట్రయల్స్ కు ఇండియాస్ డ్రగ్స్ రెగ్యులరేటర్ (భారత ఔషధ నియంత్రణ సంస్థ) తాజాగా అనుమతి ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఐసీఎంఆర్ ఎంపిక చేసిన 12 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించనుంది. వ్యాక్సిన్ ఎంత సమర్థంగా పనిచేస్తుందనే అంశంతో పాటు ఈ వ్యాక్సిన ఎంత వరకు సురక్షితం అన్నదే ప్రధానంగా ఈ క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి.
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 120కిపైగా వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయి. మన దేశానికి భారత్‌కు చెందిన సుమారు ఆరు సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి.