English | Telugu

బావా త్వరగా రావా.. హరీష్ కు ట్వీట్ చేసిన కేటీఆర్

కరోనా నేపథ్యంలో నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా పాజిటివ్ ఉంటే అసెంబ్లీ సమావేశాలకు నో ఎంట్రీ అన్న విషయాన్ని శాసనసభ, మండలి స్పీకర్లు ఇప్పటికే స్పష్టంచేశారు. ఈ ప్రకటన వెలువడి 24గంటలు గడవకముందే ఆర్థికశాఖమంత్రి టి. హారిష్ రావు తనకు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చిందని, తనను ఈ వారం రోజుల్లో కలిసిన వారంతా ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ట్విట్టర్ లో తెలిపారు. దాంతో ఒక్కసారిగా మంత్రులు, ఎమ్మెల్యేలు, టిఎస్ఆర్ నాయకులు ఉలిక్కి పడ్డారు. కరోనా వచ్చినవారు కనీసం 15రోజుల నుంచి 20రోజుల వరకు ఐసోలేషన్ లో ఉండాలి. అయితే సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షకాల సమావేశాలకు హారిష్ రావు పూర్తిగా దూరంగా ఉండనున్నారని వినిపిస్తోంది. ఈ సమావేశాలు ఆర్థిక శాఖ మంత్రి లేకుండానే జరగనున్నాయా అన్న చర్చజరుగుతోంది. అయితే ఆర్థికశాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి కెసిఆర్ ఎవ్వరికి ఇస్తారో అన్న చర్చ కూడా జరుగుతుంది. ఈనెల 7న జరిగే టిఆర్ఎల్ పి సమావేశానికి కూడా హారిష్ దూరంగానే ఉండనున్నారు. ఇక, బావా త్వరగా కోలుకో అంటూ కెటిఆర్ చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది.