English | Telugu
భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోండి: బండి సంజయ్
Updated : May 1, 2020
అనునిత్యం అన్ని రంగాల్లో తమ శ్రమను దారపోస్తున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
లేబర్ కమిషనర్ తీర్మానం ప్రకారం వెంటనే భవన నిర్మాణ కార్మికులందరికి 1500 రూపాయలను అందించాలి. కార్మికుల సహాయ నిధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పూర్తి ఆదేశాలు ఇచ్చిన రాష్ట్రం అదుకోకపోవడం దురదృష్టకరం.
మే డే సందర్భంగానైనా సీఎం కేసీఆర్ భవన నిర్మాణ కార్మికులకు 1500 విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఇచ్చిన 1500 పేరుతో కార్మికులను మోసం చేయడం తగదు. వారికి తక్షణమే అదనంగా కమిషన్ ఆదేశాల మేరకు 1500 అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.